Ashok Galla: మా కష్టానికి ప్రతిఫలాన్నిప్రేక్షకుల నవ్వుల్లో చూస్తున్నాం

అశోక్‌ గల్లా, నిధి అగర్వాల్‌ జంటగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘హీరో’. పద్మావతి గల్లా నిర్మించారు. జగపతిబాబు, నరేశ్‌, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం థ్యాంక్యూ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ గల్లా మాట్లాడుతూ ‘

Updated : 17 Jan 2022 06:44 IST

అశోక్‌ గల్లా, నిధి అగర్వాల్‌ జంటగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘హీరో’. పద్మావతి గల్లా నిర్మించారు. జగపతిబాబు, నరేశ్‌, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం థ్యాంక్యూ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ గల్లా మాట్లాడుతూ ‘‘మా ‘హీరో’ను చూసి నవ్వి, ఎంజాయ్‌ చేసిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నన్నిక్కడి దాకా తీసుకొచ్చిన అమ్మానాన్నలకు థ్యాంక్స్‌. నేనీ చిత్రం గురించి పెద్దగా చెప్పదలచుకోలేదు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే మీరింత నవ్వుకున్నారా అని షాకై పోతారు. దర్శకుడు శ్రీరామ్‌ వల్లే నేను హీరో అయ్యాను’’ అన్నారు.

‘‘అశోక్‌ తన పాత్రను అద్భుతంగా పోషించాడు. ఏ ఫ్రేం చూసినా.. తన నటనలో ఎక్కడా లోపం కనిపించలేదు’’ అన్నారు జగపతిబాబు. దర్శకుడు శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘థియేటర్లు చూస్తుంటే నిజంగా పండగలా ఉంది మాకు. మేము దేని కోసమైతే కష్టపడి ఈ చిత్రం చేశామో.. దానికి ప్రతి ఫలాన్ని ప్రేక్షకుల నవ్వుల్లో చూస్తున్నాం. ఈ చిత్రం కోసం అశోక్‌ పడిన కష్టం తెరపై చక్కగా కనిపిస్తుంది’’ అన్నారు. ‘‘హీరోగా అశోక్‌కి మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు నటుడు నరేష్‌. నిర్మాత పద్మావతి గల్లా మాట్లాడుతూ ‘‘అశోక్‌ బాగా చేశాడని రిపోర్ట్‌లు వస్తున్నాయి. చిత్రం చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు నవ్వుతున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. నిర్మాత జయదేవ్‌ గల్లా మాట్లాడుతూ ‘‘చిత్రానికి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్‌, బ్రహ్మాజీ, మైమ్‌ గోపీ, రోల్‌ రైడా తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని