Cinema News: విజయేంద్రప్రసాద్‌ కథతో... ‘1770’

ఎస్‌.ఎస్‌. రాజమౌళి శిష్యుడు అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో తెర కెక్కనున్న చిత్రం ‘1770’. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఆనందమఠ్‌ నవల ఆధారంగా...

Updated : 06 Sep 2022 15:26 IST

ఎస్‌.ఎస్‌. రాజమౌళి శిష్యుడు అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో తెర కెక్కనున్న చిత్రం ‘1770’. బంకించంద్ర ఛటర్జీ   రచించిన ఆనందమఠ్‌ నవల    ఆధారంగా... ప్రముఖ   రచయిత విజయేంద్రప్రసాద్‌ అందిస్తున్న కథతో ఈ చిత్రం రూపొందనుంది. శైలేంద్రకుమార్‌, సుజయ్‌ కుట్టి, కృష్ణకుమార్‌.బి, సూరజ్‌ శర్మ నిర్మిస్తున్నారు. ఆనందమఠ్‌ నవలలోని వందేమాతరం గీతం రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘ఆకాశవాణి’ చిత్రంతో పరిచయమైన అశ్విన్‌ గంగరాజు ‘1770’ని తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో రూపొందించనున్నారు. దీపావళికంతా నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని  ప్రకటించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘నాటి  కాలంలోకి తీసుకెళ్లే దృశ్యాలు, భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాల మేళవింపుగా రూపొందుతున్న చిత్రమిది.   కాన్సెప్ట్‌ని సమకూరుస్తున్న రామ్‌ కమల్‌ ముఖర్జీ విజన్‌ నాలో నమ్మకాన్ని పెంచింది’’ అన్నారు. ‘‘జాతినంతటినీ ఏకం చేసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది వందేమాతరం గీతం. 1779లో స్వాతంత్య్ర సమరం కోసం మొయన ప్రాంతంలో స్ఫూర్తిని రగిల్చిన యోధులెంతోమంది ఉన్నారు. వాళ్లందరి గురించి తెలియజేసే చిత్రమే ఇది’’ అన్నారు రచయిత విజయేంద్రప్రసాద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని