Cinema News: ఆమె.. అతడు..

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అతడు.. ఆమె.. ప్రియుడు’. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించారు

Updated : 31 Jan 2022 07:59 IST

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అతడు.. ఆమె.. ప్రియుడు’. సునీల్‌, కౌశల్‌, బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రవి కనగాల, రామ్‌ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా, దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, దశరథ్‌, రచయిత విజయేంద్రప్రసాద్‌, నిర్మాత సి.కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రచయితగా ఎన్నో సంచలనాలు సృష్టించిన యండమూరి.. దర్శకుడిగానూ ఈ సినిమాతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాం. ఆయన ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించారు. యండమూరితో మరిన్ని సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కూర్పు, కెమెరా: మీర్‌. నిర్మాణ సారధ్యం: అమర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని