Athiya Shetty: క్రికెటర్‌తో పెళ్లి.. స్పందించిన నటి

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ అతియా శెట్టి. కెరీర్‌ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన విజయాన్ని ఆమె అందుకోలేకపోయింది. అయితే, భారత క్రికెటర్‌...

Updated : 07 May 2022 13:24 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ అతియా శెట్టి. కెరీర్‌ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన విజయాన్ని ఆమె అందుకోలేకపోయింది. అయితే, భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో అతియ ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తరచూ వీళ్లిద్దరూ టూర్స్‌కి వెళ్లి వస్తుండటం ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో వీరు పెళ్లి చేసుకోనున్నారని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. బాలీవుడ్‌ జంట దీపిక-రణ్‌వీర్‌ల ఇంటికి సమీపంలోనే వీరిద్దరూ ఓ ఫ్లాట్‌ తీసుకున్నారని వివాహమైన వెంటనే ఆ ఇంట్లోకి మకాం మార్చనున్నారని చెప్పుకున్నారు.

ఈ వార్తల నేపథ్యంలో అతియాశెట్టి ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేసింది. ‘‘పెళ్లి గురించి వస్తోన్న వార్తలకు నేను సమాధానం చెప్పాలనుకోవడం లేదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చెప్పి ఇప్పటికే అలసిపోయాను. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి వార్తలు చూసి నవ్వి వదిలేస్తున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్లని ఊహించుకోనివ్వండి’’ అని అతియా అన్నారు. అనంతరం ‘‘మేడమ్‌.. మీరు ఓ వ్యక్తితో కలిసి కొత్తింటిలోకి మారుతున్నారని చెప్పుకొంటున్నారు? నిజమేనా?’’ అని ప్రశ్నించగా.. ‘‘నేను ఏ వ్యక్తితోనూ కలిసి ఇల్లు మారడం లేదు. మా కుటుంబంతోపాటే ఇల్లు మారుతున్నా. మా ఫ్యామిలీ మొత్తం కొత్త ఇంటిలోకి షిప్ట్‌ అవుతున్నాం’’ అని ఆమె సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని