Athiya Shetty: నటి పెళ్లిపై రూమర్స్‌.. స్పందించిన ఆమె తండ్రి

బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టి ప్రముఖ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. తరచూ వీళ్లిద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్లడం, బాలీవుడ్‌లో జరిగే పార్టీల్లో కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత బలపడుతున్నాయి. 

Published : 13 May 2022 02:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టి ప్రముఖ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తరచూ వీళ్లిద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్లడం, బాలీవుడ్‌లో జరిగే పార్టీల్లో కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింత బలపడుతున్నాయి. డిసెంబర్‌లో వీళ్ల పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించబోతున్నారంటూ వస్తున్న రూమర్స్‌ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సునీల్‌ శెట్టి ఈ పుకార్లపై స్పందించారు. తన కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఇష్టమేనన్నారు. ‘నా కుమార్తె అతియా ఏదో ఒకరోజు వివాహం చేసుకోవాల్సిందే. నా కుమారుడు సైతం ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటాడు. అది ఎంత తొందరగా జరిగితే అంత మేలు. అది వాళ్ల నిర్ణయం. ఇక కేఎల్‌ రాహుల్ విషయానికొస్తే నేను అతనిని చాలా ఇష్టపడతాను, గౌరవిస్తాను. వాళ్లు తీసుకునే నిర్ణయాలపై వాళ్లకి పూర్తి స్వేచ్ఛ ఉంది. నా పిల్లలిద్దరూ చాలా బాధ్యత గల వ్యక్తులు. వాళ్లు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. వాళ్లకి నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది’ అని సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని