Jawan ott release: కొత్త సీన్స్‌తో ‘జవాన్’ ఓటీటీ రిలీజ్.. అట్లీ సూపర్ ప్లాన్
‘జవాన్’ (Jawan) ఓటీటీ రిలీజ్‌పై దర్శకుడు అట్లీ (Atlee) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ముంబయి: ‘జవాన్’ (Jawan)తో సూపర్‌హిట్ అందుకున్నారు దర్శకుడు అట్లీ (Atlee). షారుక్ ఖాన్ (Shah Rukh Khan) - నయనతార (Nayanthara) జంటగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే అట్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సరైన నిడివి, ఎమోషన్స్‌తో ‘జవాన్’ థియేటర్ రిలీజ్ చేశాం. ఓటీటీ రిలీజ్‌కు వచ్చేసరికి ఇంకాస్త రిథమ్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను దానిపైనే వర్క్ చేస్తున్నా. అందుకే హాలీడేకు కూడా వెళ్లలేదు. మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు.
మాలాంటి స్నేహితులు మరెవరూ లేరు: రజనీకాంత్‌ను ఉద్దేశిస్తూ కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘రానున్న నాలుగు నెలలు మా అబ్బాయితోనే టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే, దాదాపు మూడున్నరేళ్ల నుంచి ‘జవాన్’ వర్క్‌లోనే ఉన్నా. ఈ సినిమా తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరేలా సినిమా చేయాలి. కాబట్టి, కాస్త సమయం తీసుకుని తదుపరి ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తా’’ అని ఆయన తెలిపారు. ‘అల్లు అర్జున్’తో సినిమాపై మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం మంచి స్నేహితులం. సినిమా విషయంలో మాకొక ఐడియా ఉంది. ఒక సినిమా సిద్ధం కావాలంటే భగవంతుడి ఆశీస్సులు అవసరం. కాబట్టి వాటి కోసం చూద్దాం’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: మాజీ మంత్రి బండారుకు నారా లోకేశ్ ఫోన్
-
PM Modi: అభివృద్ధిపై వాళ్లకు విజన్, రోడ్‌మ్యాప్ లేవు.. విపక్షాలపై మోదీ ఫైర్
-
Rajinikanth: రజనీకాంత్ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్.. ఎవరెవరంటే?
-
Vande Bharat Train: ట్రాక్‌పై రాళ్లు.. వందే భారత్ లోకో పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
-
Pawan Kalyan: మున్ముందు దేశమంతా జనసేన భావజాలమే: పవన్ కల్యాణ్
-
Mohamed Muizzu: ముయిజ్జుతో జాగ్రత్త..