
Attack: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యోధుడు
జాన్ అబ్రహం సూపర్‌సోల్జర్‌గా నటిస్తున్న చిత్రం ‘ఎటాక్-1’. ఈ సినిమాలోని ‘మే నై టుట్నా’’ అంటూ సాగే పాటను శనివారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రకాష్‌రాజ్, రకుల్ ప్రీత్‌సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తదితరులు ఈ పాటలో కనిపించారు. జాన్ అబ్రహం సూపర్ సోల్జర్‌గా మారే క్రమంలో వచ్చే సన్నివేశాలతో గీతాన్ని తీర్చిదిద్దారు. కథానాయకుడు కండలు తిరిగిన దేహంతో వీధుల్లో పరిగెత్తడం, జిమ్‌లో కసరత్తులు చేయడం చూపించారు. ఈ సందర్భంగా జాన్ మాట్లాడుతూ ‘‘ఎటాక్ ఒక విజువల్ వండర్‌గా రూపొందింది. పబ్జీ, మార్షల్ కాంబ్యాట్ వంటి వీడియో గేమ్స్‌ను మించిన యాక్షన్ అనుభూతి ఈ చిత్రంలో ఉంటుంది. మానవాతీత శక్తుల కలిగిన యోధుడిలా నేను కన్పించనున్నా. ప్రపంచం భవిష్యత్తులో చూడనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ)సైనికుడు ఎలా ఉంటాడో ఇందులో చిత్రీకరించాం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ సినిమాకు ఓ నిర్మాతగానూ మారాల్సి వచ్చింది. ఏప్రిల్ 1న ప్రేక్షకులను యాక్షన్ హంగామాతో ఆకట్టుకుంటాం.’’ అని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
-
General News
Health: చిగుళ్ల ఆరోగ్యంతోనే దంతాల మెరుపు
-
Sports News
Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
-
India News
Manipur landslide: 37కు చేరిన మణిపుర్ మృతుల సంఖ్య.. ఇంకా లభించని 25 మంది ఆచూకీ..!
-
General News
Mayocarditis: గుండె కండరం వాచినా కష్టాలే సుమా..!
-
Politics News
Samajwadi Party : సమాజ్‌వాది పార్టీ పునర్వ్యవస్థీకరణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్’కు.. ఆనంద్ మహీంద్రా రియాక్ట్!
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- PM Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
- IndiGo: ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్’..! 900 సర్వీసులు ఆలస్యం
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?