నాని ‘జెర్సీ’పై అమందా బెయిలీ ప్రశంసలు

ఇప్పటికే జాతీయ అవార్డు సాధించి తన సత్తా చాటుకున్న ‘జెర్సీ’ ఇప్పుడు ఖండాతరాలు దాటింది. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్‌ జర్నలిస్టు క్లోయ్‌ అమందా బెయిలీ ‘జెర్సీ’ సినిమాపై ప్రశంసలు కురిపించింది. సినిమాలో రైల్వే స్టేషన్‌ సన్నివేశం తననెంతో ఆకట్టుకుందని ఆమె చెప్పుకొచ్చింది.

Updated : 30 Aug 2022 14:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే జాతీయ అవార్డు సాధించి తన సత్తా చాటుకున్న ‘జెర్సీ’ ఇప్పుడు ఖండాతరాలు దాటింది. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్‌ జర్నలిస్టు క్లోయ్‌ అమందా బెయిలీ ‘జెర్సీ’ సినిమాపై ప్రశంసలు కురిపించింది. సినిమాలో రైల్వే స్టేషన్‌ సన్నివేశం తననెంతో ఆకట్టుకుందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా చూసిన తర్వాత ట్విటర్‌ ద్వారా ఆమె తన అభిప్రాయాన్ని పంచుకుంది. ‘‘ఇటీవల ‘జెర్సీ’ చూశాను. అదొక అద్భుతమైన భావోద్వేగ ప్రయాణం. నాని చాలా బాగా నటించారు. అతని నటన చూసి మీరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. సినిమాను ఎంతో బాగా తెరకెక్కించారు. రైల్వే స్టేషన్‌ సన్నివేశం నాకు బాగా నచ్చింది. సినిమా చూసిన తర్వాత నా భయమే నాకు ఉల్లాసంగా మారింది’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ ట్వీట్‌లో రైల్వే స్టేషన్‌ సీన్‌ వీడియోను పంచుకుందామె.

హాలీవుడ్‌ పూర్తిగా భిన్నంగా ఉంటుందని.. తాను మాత్రం ఎక్కువగా ఇండియన్‌ సినిమాలే చూస్తానని చెప్పింది. ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఉంటే తనకు సూచించాలని కోరింది. ఓ నెటిజన్‌ ‘మజిలీ’ చిత్రాన్ని చూడమని చెప్పగానే.. ఆ సినిమా పోస్టర్‌ చూస్తుంటే ఆ సినిమా బాగుంటుందనే విషయం అర్థమైపోతుందని.. వెంటనే చూస్తా అని ఆమె స్పందించింది. పేరుకు ఆస్ట్రేలియా క్రికెట్‌ జర్నలిస్టు అయినా.. బెయిలీకి ఇండియా అంటేనే ఇష్టమట. ధోనీని లెజెండ్‌ అభివర్ణించే ఆమె.. కోహ్లీ తన అభిమాన క్రికెటర్‌ అని, ఆర్సీబీ తనకు నచ్చిన జట్టు అని వెల్లడించింది.

కాగా.. నాని ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘జెర్సీ’ని డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించారు. శ్రద్ధాశ్రీనాథ్‌, హరీశ్‌కల్యాణ్‌, రోనిత్‌ కామ్రా కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం 2019 ఏప్రిల్‌ 19న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో షాహీద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts