Avatar 2: ‘అవతార్‌ 2’ డిజిటల్‌ రిలీజ్‌.. ఎప్పుడంటే..?

‘అవతార్‌ 2’ (Avatar 2) డిజిటల్‌ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

Updated : 08 Mar 2023 14:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్‌ సినీ ప్రపంచాన్ని అలరించిన చిత్రం ‘అవతార్‌ 2’ (Avatar 2). హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కెమెరూన్‌ (james cameron) ఈ విజువల్‌ వండర్‌ను తెరకెక్కించారు. గతేడాది థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 28న ఇది డిజిటల్‌ స్క్రీన్స్‌పై ప్రేక్షకులను అలరించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అవతార్‌’ టీమ్‌ తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. మునుపెన్నడూ చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధంకండి అని పేర్కొంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యాపిల్‌ టీవీ, వుడు తదితర ఓటీటీ వేదికల్లోల ఇది స్ట్రీమింగ్‌ కానుంది. 4కె అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ అట్‌మాస్‌ ఆడియోతో రానుంది. తొలుత కొన్ని రోజుల పాటు వీడియో ఆన్‌ డిమాండ్‌ లేదా అద్దె ప్రాతిపదికను ‘అవతార్‌2’ స్ట్రీమింగ్‌ కానుంది.

2009లో విడుదలైన ‘అవతార్‌’కు కొనసాగింపుగా ఈ సినిమా సిద్ధమైంది. తొలి భాగం పండోరా గ్రహంలోని సుంద‌ర‌మైన అట‌వీ, జీవ‌రాశుల ప్రపంచం చుట్టూనే సాగుతుంది. ఈసారి క‌థ‌ని ‘ది వే ఆఫ్ వాట‌ర్’ అంటూ నీటి ప్రపంచంలోకి తీసుకెళ్లాడు జేమ్స్ కామెరూన్‌(james cameron). గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈసినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని