Avatar: సరికొత్త హంగులతో ‘అవతార్‌’.. మళ్లీ వస్తోంది!

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌’. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ

Published : 20 Sep 2022 12:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్‌’. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు, బాక్సాఫీస్‌ వద్ద 2.84 బిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.  ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘అవతార్‌: ది వేఆఫ్‌ వాటర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ‘అవతార్‌’ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. రీ రిలీజ్‌ చిత్రమే అయినా సినిమాకి కొత్త మెరుగులు దిద్ది విడుదల చేస్తున్నారు.

 ‘‘చిన్నప్పటి నుంచి థియేటర్‌లో సినిమా చూస్తే వచ్చే అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ అనుభూతిని సరికొత్తగా అందించబోతున్నాం.  అప్పట్లో ‘అవతార్‌’ని త్రీడీలో చూసి ప్రేక్షకులు ఆస్వాదించారు. ఇప్పుడు దీన్ని 4కే ఫార్మాట్‌లోకి మార్చి హై డైనమిక్‌ రేంజ్‌లో తీర్చిదిద్దాం. అంతేకాదు, 9.1సౌండ్‌తో సెప్టెంబరు 23న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి ఫ్రేమ్‌ సరికొత్త అనుభూతిని పంచేలా ఉంటుంది. ఈ చిత్రంలో నటించిన నటులు ఈ కొత్త వెర్షన్‌ చూసి వావ్‌ అంటున్నారు’’అని ఆనందం వ్యక్తం చేశారు కామెరూన్‌.

‘అవతార్‌’ సిరీస్‌లో వస్తోన్న రెండో చిత్రం ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ డిసెంబరులో రానుంది. తొలి భాగంలో నటించిన సామ్‌ వర్దింగ్టన్‌, జోయా సాల్డానాలతో పాటు, ఇందులో కేట్‌ విన్సెలెట్‌ కూడా నటిస్తోంది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని