Avatar: మళ్లీ వస్తున్న ‘అవతార్‌’

‘పండార గ్రహం.. అక్కడి అద్భుత ప్రకృతి,  విచిత్రమైన జంతువులు, ఉనికి కోసం పోరాడే అక్కడి జీవజాతి...’ ఇలా ప్రతీ ఒక్కటీ సినీ ప్రేక్షకులకు పరిచయమే. జేమ్స్‌ కామరూన్‌ తెరకెక్కించిన ‘అవతార్‌’ 2009లో విడుదలై వీటిని మన కళ్లముందు ఉంచింది.

Updated : 25 Aug 2022 06:50 IST

‘పండార గ్రహం.. అక్కడి అద్భుత ప్రకృతి,  విచిత్రమైన జంతువులు, ఉనికి కోసం పోరాడే అక్కడి జీవజాతి...’ ఇలా ప్రతీ ఒక్కటీ సినీ ప్రేక్షకులకు పరిచయమే. జేమ్స్‌ కామరూన్‌ (James Cameron) తెరకెక్కించిన ‘అవతార్‌’ (Avatar) 2009లో విడుదలై వీటిని మన కళ్లముందు ఉంచింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘అవతార్‌-2’ తీస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 16న ఇది విడుదల కానుంది. ఈ  నేపథ్యంలో ‘అవతార్‌’ను మరోసారి మనకు చూపించడానికి సిద్ధమైంది చిత్రబృందం. సెప్టెంబర్‌ 23న ఇది థియేటర్లలో విడుదల కానుంది. ఈసారి 4కే హై డైనమిక్‌ రేంజ్‌ సౌండ్‌, విజువల్స్‌తో కనువిందు చేస్తామని చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని