Avatar2: పండోరా.. కొత్త అద్భుతాలు

ప్రపంచ సినీ ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన చిత్రం ‘అవతార్‌’. జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన ఈ అద్భుతాన్ని ఇంకా ఇంకా చూడాలనుకున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ సినిమాకు మరో నాలుగు సీక్వెల్స్‌ను ప్రకటించారు కామెరూన్‌.

Updated : 03 Nov 2022 08:27 IST

ప్రపంచ సినీ ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన చిత్రం ‘అవతార్‌’. జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన ఈ అద్భుతాన్ని ఇంకా ఇంకా చూడాలనుకున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ సినిమాకు మరో నాలుగు సీక్వెల్స్‌ను ప్రకటించారు కామెరూన్‌. అందులో భాగంగానే రెండో సీక్వెల్‌గా ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ను తీర్చిదిద్దుతున్నారు. దీనికి సంబంధించిన తొలి పోస్టర్‌ విడుదలైంది మొదలు సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా ఎలా ఉండబోతుందో బుధవారం విడుదల చేసిన ట్రైలర్‌తో రుచి చూపించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేషమైన స్పందన లభిస్తోంది. పండోరా గ్రహంపై ఇంతకుముందు చూడని కొత్త అందాల్ని, అద్భుతాల్ని ఇందులో చూపించారు. సముద్ర గర్భంలో సాగే సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం కామెరూన్‌ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారట. అవతార్‌ 2తో పాటే అవతార్‌ 3ని కూడా చిత్రీకరించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు మాత్రం ‘అవతార్‌ 2’ విడుదల తర్వాతే మొదలుపెట్టే అవకాశం ఉంది. జోయీ సల్డానా, సామ్‌ వర్తింగ్‌టన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబరు 16న రానుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని