Avatar2: మూడు రోజులు 15వేలకు పైగా ప్రీమియం టికెట్లు.. ‘అవతార్‌2’కు క్రేజ్‌

‘అవతార్‌2’ రికార్డులు తిరగరాస్తోంది. ‘అవతార్’ సీక్వెల్ ప్రీమియం ఫార్మాట్‌లలో 45 స్క్రీన్‌లలో అడ్వాన్స్ ఓపెనింగ్స్ మొదలవగా, 3 రోజుల్లోనే 15,000 టిక్కెట్‌లు విక్రయమయ్యాయి.

Published : 26 Nov 2022 17:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్‌2’. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’గా డిసెంబరు 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ‘అవతార్‌2’ రికార్డులు తిరగరాస్తోంది. ‘అవతార్’ సీక్వెల్ ప్రీమియం ఫార్మాట్‌లలో 45 స్క్రీన్‌లలో అడ్వాన్స్ ఓపెనింగ్స్ మొదలవగా, 3 రోజుల్లోనే 15,000 టిక్కెట్‌లు విక్రయమయ్యాయి.

ఈ సందర్భంగా పీవీఆర్‌ పిక్చర్‌ సీఈవో జియా చందానీ మాట్లాడుతూ.. “జేమ్స్ కామెరూన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. భారతదేశంలోనూ ఆయన మూవీలను చూసే వారు ఎక్కువ. అందుకే ‘అవతార్2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌పై భారీ స్పందన వస్తోంది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్‌లకు మాత్రమే. సాధారణ బుకింగ్స్‌ మొదలైతే అత్యధిక సంఖ్యలో టికెట్‌ బుకింగ్స్‌ జరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు. ఐనాక్స్‌ చీఫ్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ రాజేందర్ సింగ్ జ్యాలా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘13ఏళ్ల క్రితం విడుదలైన అవతార్‌ చిత్రానికి వచ్చిన భారీ స్పందన చూసి అందరం ఆశ్చర్యపోయాం. దానికి మించిన స్పందన ‘అవతార్2’కు వస్తోంది. సినిమాను సినీపోలిస్‌ రియల్‌ 3డీలో ప్రేక్షకులకు అందిస్తున్నాం’’ అని సినీపోలీస్ సీఈఓ దేవాంగ్ సంపత్ వెల్లడించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని