Avika Gor: అభ్యంతరకరంగా తాకాడు.. కానీ, ఏం చేయలేకపోయా: అవికా గోర్‌

ఓ ఈవెంట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అవికా గోర్‌ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ధైర్యం లేక ఏం చేయలేకపోయినట్లు తెలిపారు.

Published : 18 Jun 2024 12:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలనటిగా కెరీర్‌ ఆరంభంలోనే విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు నటి అవికా గోర్‌. ఇండస్ట్రీకి వచ్చాక వరుస సినిమాలతో అలరించారు. గతంలో ఓ ఈవెంట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. తన (Avika Gor) బాడీగార్డ్‌ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని తెలిపారు.

‘విదేశాల్లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనకనుంచి తాకినట్లు అనిపించింది. తిరిగి చూస్తే బాడీగార్డ్‌ మాత్రమే ఉన్నాడు. వేదిక పైకి వెళ్తున్నప్పుడు కూడా అభ్యంతరకరంగా తాకాలని చూశాడు. వెంటనే చేయి పట్టుకున్నాను. ‘ఏం చేస్తున్నారు మీరు’ అని నిలదీశాను. అతడు క్షమాపణలు చెప్పడంతో ఏం చేయలేక వదిలేశాను. నాకు ధైర్యం ఉంటే ఇలా చేసిన చాలామందిని కొట్టేదాన్ని. కానీ అప్పట్లో అంత ధైర్యం లేదు. ఇలాంటి అనుభవం ఇప్పుడు ఎదురైతే కచ్చితంగా ఎదురుతిరుగుతాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలా ఎవరూ ప్రవర్తించడం లేదు. ఎదుటివారు చేసే కొన్ని పనులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అది వాళ్లకు తెలియదు’ అని చెప్పారు.

వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్‌ మీడియా ఖాతాలపై టీమ్‌ క్లారిటీ

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన అవికా గోర్‌ (Avika Gor) ‘ఉయ్యాలా.. జంపాల’తో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించారు. ఆతర్వాత వరుసగా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ , ‘తను నేను’, ‘రాజుగారి గది 3’ వంటి సినిమాలతో మెప్పించారు. ఇప్పటివరకు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 24 సినిమాలు చేశారు. గతేడాది ‘వధువు’ అనే వెబ్‌ సిరీస్‌తో అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని