
AvikaGor: అవికా చేతిలో ఆరు చిత్రాలు
ఇంటర్నెట్ డెస్క్: సినిమా అవకాశాల విషయంలో జోరు చూపిస్తోంది యువ నాయిక అవికా గోర్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్ర బృందాలు అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్లని విడుదల చేశాయి. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది అవికా. ఆ వివరాలవీ.. ఆది సాయి కుమార్ సరసన ఆమె నటిస్తోన్న ‘అమరన్’ చిత్రం ఏప్రిల్లో లాంఛనంగా ప్రారంభమైంది. బలవీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మరోవైపు యువ నటులు నవీన్ చంద్ర, కల్యాణ్ దేవ్, వెన్నెల రామారావులతో సందడి చేయనుంది. హేమంత్ దర్శకత్వం వహిస్తోన్న ఓ చిత్రంలో సవాలు విసిరే పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. స్వీయ నిర్మాణంలో ‘పాప్కార్న్’ అనే చిత్రాన్ని ప్రకటించింది.
‘బాలికా వధు’ (చిన్నారి పెళ్లికూతురు) ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న అవికా తెలుగు చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’తో నాయికగా మారింది. ‘లక్ష్మీరావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది 3’ సినిమాలతో మెప్పించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.