Aliabhatt: ఆలియా బర్త్‌డే.. స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అయాన్‌

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ పుట్టినరోజు నేడు. దీంతో ఈ చిన్నదానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ స్పెషల్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న....

Published : 15 Mar 2022 11:52 IST

ముంబయి: బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ పుట్టినరోజు నేడు. ఈ ముద్దుగుమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ నుంచి ఆలియా ఫస్ట్‌లుక్‌ని షేర్‌ చేశారు. ఈ సినిమాలో ఆమె ఇషా పాత్రలో కనిపించనున్నారు. బిగ్గెస్ట్‌ యాక్షన్‌, ఫిక్షన్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడు. నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రెండు భాగాల్లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో ‘శివ’ పేరుతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 9.9.2022లో ‘బ్రహ్మాస్త్ర’ మొదటి భాగం విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని