Chiranjeevi: చిన్నారి టాలెంట్‌కు చిరంజీవి ఫిదా.. ఇంటికి పిలిచి ఆశీర్వదించిన మెగాస్టార్
‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’ కంటెస్టెంట్ అయ్యన్ ప్రణతిని చిరంజీవి (Chiranjeevi) అభినందించారు. ఇంటికి పిలిచి ఆశీర్వదించారు.
హైదరాబాద్: టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ (Chiranjeevi) ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’ కంటెస్టెంట్ అయ్యన్ ప్రణతి ప్రతిభకు చిరంజీవి ఫిదా అయ్యారు. ఆమెను ఇంటికి పిలిచి అభినందించారు. వైజాగ్‌కు చెందిన ప్రణతి తన సింగింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు ఆడియన్స్‌తో పాటు ఎందరో సినీ ప్రముఖులు ఈ చిన్నారిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా మెగాస్టార్ కూడా ఆమె టాలెంట్‌ను మెచ్చుకున్నారు. ఇంటికి పిలిపించుకుని అన్నమాచార్య కీర్తనను పాడించుకున్నారు. చిరంజీవి దంపతులు ఆమెతో కాసేపు సరదాగా గడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
ఇక మెగాస్టార్‌తో కలిసి సమయాన్ని గడపడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రణతి పేర్కొంది. ‘చిరంజీవి సినిమాలు చూస్తు పెరిగిన నేను.. ఆయన ముందు పాడడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఎన్నో రోజుల కల ఈరోజు నెరవేరింది. ఆయన్ని కలిసిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. రానున్న ఎపిసోడ్‌లలో ఇంకా బాగా పాడాలని చిరు దంపతులు నన్ను ఆశీర్వదించారు’ అని తెలిపింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’ (Telugu Indian Idol 2) ప్రసారమవుతోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గాయకుడు కార్తిక్, గాయని గీతామాధురి ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi Sanjay: తెదేపా, భాజపా పొత్తు వ్యవహారం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ts-top-news News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ కొంత కఠినమే..
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా