
దున్నతో భళ్లాలదేవుడి ఫైట్.. ఇలా తీశారు!
ఇంటర్నెట్‌డెస్క్: విజువల్ వండర్‌గా యావత్ సినీ ప్రపంచాన్ని సంభమాశ్చర్యాలకు గురి చేసిన చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు ఖ్యాతిని ప్రపంచ యవనికపై నిలిపింది. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, నాజర్, తమన్నా, సత్యరాజ్‌ల నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక మాహిష్మతి సామ్రాజ్యం, కుంతల రాజ్యం, కాలకేయులతో యుద్ధ సన్నివేశాలు థియేటర్‌లో చూస్తుంటే ప్రేక్షకులకు రెండు కళ్లూ సరిపోలేదంటే అతిశయోక్తి కాదు.
ఏది నిజమో.. ఏది విజువల్ ఎఫెక్ట్ సన్నివేశమో తెలియనంతగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దీన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా దర్శకుడి ఊహకు తగిన విధంగా వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు శ్రీనివాసమోహన్ అందించిన సన్నివేశాలు సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. ముఖ్యంగా భళ్లాల దేవుడు.. అడవి దున్నతో ఫైట్ చేసే సీన్ గగుర్పాటు కలిగిస్తుంది. ఆ సన్నివేశాలను ఎలా తెరకెక్కించారో మీరూ చూసేయండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.