Sai Rajesh: నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు

సోషల్‌ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేశ్‌. తాను సాయం చేసిన వ్యక్తే తనను తిట్టాడని తెలిపారు.

Published : 22 Sep 2023 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బేబీ’ (Baby) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సాయి రాజేశ్ (Sai Rajesh). సోషల్‌ మీడియాలో ఎదురయ్యే సమస్యల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘మీ సినిమాల ప్రచారం విషయంలో ఎక్స్‌ (ట్విటర్‌) బాగా ఉపయోగపడింది కదా’ అని హోస్ట్‌ చెప్పగా సాయి రాజేశ్‌ స్పందించారు.

పోస్టర్‌లతోనే ‘లియో’ కథను హింట్‌ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1

‘‘సోషల్‌ మీడియాని ఎంత వరకు వినియోగించాలో అంత వరకే వినియోగించుకోవాలి. అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల ఉపయోగం లేదు. ఓ హీరో సినిమా విషయంలో నేను పెట్టిన పోస్ట్‌ను చూసి కొందరు నన్ను విమర్శించారు. బూతులు తిట్టారు. ఆ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి విపరీతంగా తిట్టాడు. ఎందుకలా టార్గెట్‌ చేసి అసభ్యంగా కామెంట్లు పెడుతున్నాడోనని వివరాలు తెలుసుకునేందుకు పర్సనల్‌గా మెసేజ్‌ చేద్దామని ప్రయత్నించా. ఆ క్రమంలో షాకయ్యా. ఎందుకంటే.. కొవిడ్‌ సమయంలో అనారోగ్యంగా ఉన్నానని, ఆర్థిక సాయం చేయండంటూ అతడు ఓ పోస్ట్‌ పెట్టాడు. దాన్ని చూసి అప్పుడు నాకు తోచినంత సాయం చేశా. తన మైండ్‌ సెట్‌ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నీకు హెల్ప్‌ చేశా కదా.. ఎందుకు తిడుతున్నావ్‌? అని అడిగా. ‘ఏంటన్నా దాన్నీ దీన్నీ లింక్‌ చేస్తున్నావ్‌.. ఇక్కడ అభిమానిని అభిమానిగా చూడాలి. నువ్వు ఆ హీరో ఫ్యాన్‌. నేను ఈ హీరో ఫ్యాన్‌. కానీ, వ్యక్తిగతంగా నీపై నాకెప్పుడూ గౌరవం ఉంటుందన్నాడు’’ అని సాయి రాజేశ్‌ తెలిపారు. అప్పటి నుంచి ‘ఎక్స్‌’లో యాక్టివ్‌గా ఉండట్లేదన్నారు.

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బేబీ’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీకి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ విశేష ఆదరణ దక్కింది. ఈ మూవీ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని