Baby: టీజర్‌ కూడా రాకముందే.. దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్‌

ఆనంద్‌ దేవరకొండ - వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 

Published : 13 Oct 2022 13:29 IST

హైదరాబాద్‌: ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘బేబీ’ (Baby). వైష్ణవి చైతన్య కథానాయిక. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రానికి సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా టీజర్‌ కూడా విడుదల కాకముందే దర్శకుడు సాయి రాజేశ్‌కు ఖరీదైన కానుక లభించింది. ‘బేబీ’ ఫుటేజీని చూసిన చిత్ర నిర్మాతలు మారుతి, శ్రీనివాస కుమార్‌ సినిమా హిట్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా పట్ల తమ ఆనందాన్ని తెలియజేస్తూ దర్శకుడుకి ఎంజీహెక్టార్‌ప్లస్‌ కారును బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోను సాయి రాజేశ్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

‘‘సినిమా బాగా తీశాననే ఇష్టమో.. హిట్‌ కొట్టాల్సిందే అని బ్లాక్‌మెయిలో కానీ,  చిత్ర నిర్మాతలు కారుని బహుమతిగా ఇచ్చారు. ‘బేబీ’ టీజర్‌ త్వరలోనే మీ ముందుకు రానుంది. ఈసారి కూడా నేను పూర్తి నమ్మకంతో ఉన్నా’’ అని ఆయన వివరించారు. ‘కలర్‌ఫొటో’కు నిర్మాతగా వ్యవహరించిన సాయిరాజేశ్‌ ఇటీవల జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని