Baby: డబ్బింగ్‌ పనుల్లో ‘బేబీ’

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బేబీ’. సాయిరాజేశ్‌ దర్శకత్వం  వహిస్తున్నారు. ఎస్‌.కె.ఎన్‌తో కలిసి దర్శకుడు మారుతి నిర్మిస్తున్నారు. విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య కీలక పాత్రధారులు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయని

Updated : 13 Aug 2022 08:51 IST

నంద్‌ దేవరకొండ (Anand Deverakonda) కథానాయకుడిగా మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘బేబీ’ (Baby). సాయిరాజేశ్‌ దర్శకత్వం  వహిస్తున్నారు. ఎస్‌.కె.ఎన్‌తో కలిసి దర్శకుడు మారుతి నిర్మిస్తున్నారు. విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య కీలక పాత్రధారులు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయని సినీ వర్గాలు తెలిపాయి. ‘‘ప్రేక్షకులకు విభిన్నమైన అనుభవాన్ని పంచే చిత్రమిది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని