Baby: వాస్తవ ఘటనల స్ఫూర్తితో... ‘బేబి’

తమిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన స్ఫూర్తితో ‘బేబి’ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు సాయిరాజేష్‌. ఆయన దర్శకత్వంలో... ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు.

Updated : 23 Nov 2022 07:03 IST

మిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన స్ఫూర్తితో ‘బేబి’ (Baby) చిత్రాన్ని తెరకెక్కించామన్నారు సాయిరాజేష్‌ (Sai Rajesh). ఆయన దర్శకత్వంలో... ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రధారులుగా నటించారు. మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎస్‌.కె.ఎన్‌, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల హైదరాబాద్‌లో టీజర్‌ని విడుదల చేశారు. దర్శకులు అనిల్‌ రావిపూడి, హరీష్‌శంకర్‌, వశిష్ట, వెంకటేష్‌ మహా, వీఐ ఆనంద్‌, వశిష్ఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనలకి మారుతి తరహాలో వినోదం జోడిస్తూ ఈ కథని తయారు చేశా. ఓ మంచి కథని నిజాయతీగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామ’’న్నారు. ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో నాకు సవాల్‌ విసిరిన, సంతృప్తినిచ్చిన సినిమా ఇది. నేను చేసే పూర్తిస్థాయి వాణిజ్య ప్రధానమైన చిత్రం కూడా ఇదే’’ అన్నారు. అందమైన భావోద్వేగాల్ని పంచే చిత్రమిదన్నారు కథానాయిక. ‘‘మన ప్రేక్షకులకు ఎలా చూపిస్తే బాగుంటుందో అలాగే తెరకెక్కించారు దర్శకుడు సాయిరాజేష్‌.  ఈ సినిమాతో తనకి దర్శకుడిగా మరింత పేరొస్తుంది. ఆనంద్‌, విరాజ్‌ నటన ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు మారుతి. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని