Badhaai Do: వినోదాల ‘బధాయి దో’

‘బధాయి హో’ విజయం తర్వాత ఆ ఫ్రాంచైజీలో వస్తున్న చిత్రం ‘బధాయి దో’. రాజ్‌కుమార్‌ రావ్‌, భూమి పెడ్నేకర్‌ జంటగా హర్షవర్థన్‌ కులకర్ణి తెరకెక్కించారు.

Updated : 26 Jan 2022 07:07 IST

‘బధాయి హో’ విజయం తర్వాత ఆ ఫ్రాంచైజీలో వస్తున్న చిత్రం ‘బధాయి దో’. రాజ్‌కుమార్‌ రావ్‌, భూమి పెడ్నేకర్‌ జంటగా హర్షవర్థన్‌ కులకర్ణి తెరకెక్కించారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఆద్యంతం నవ్వులు పంచుతూనే, ఓ సామాజిక అంశాన్ని చర్చించినట్టు ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ పోలీస్‌ అధికారిగా, భూమి పీఈటీ టీచర్‌గా నటించారు. వీళ్ల జీవితాల మధ్య మరో అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది తెరపైనే చూడాలి. వచ్చే నెల 11న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని