Baharla Ha Madhumas: యూట్యూబ్, ఇన్‌స్టాలో ఈ పాట ఇప్పుడు ట్రెండ్!
మహారాష్ట్ర షాహిర్ చిత్రంలోని ‘బహర్లా హ మధుమాస్’ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతోంది.
ఇంటర్నెట్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ విషయం ట్రెండ్ అవుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఏదైనా సినిమాలో ఓ పాట వినసొంపుగా, సిగ్నేచర్ స్టెప్‌తో వేసేలా ఉంటే భాషతో సంబంధం లేకుండా యూట్యూబ్, ఇన్‌స్టాలో రీల్స్ వర్షం కురుస్తోంది. మొన్న ‘సారంగదరియా’కు యువత ఫిదా అయితే, నిన్న ‘సామి సామి’ పాటకు మాస్, క్లాస్ వెర్రెత్తిపోయారు. ఇప్పుడు ‘బహర్లా హ మధుమాస్’ (bharla ha madhumas) వంతు.
కేదార్ షిందే దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ చిత్రం ‘మహారాష్ట్ర షాహిర్’. అంకుష్ చౌదరి, సనా కేదార్ షిందే కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఇందులో ‘బహర్లా హ మధుమాస్’ పాట టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. యూట్యూబ్, ఇన్‌స్టా ఓపెన్ చేస్తే వరుస పెట్టి రీల్స్ వచ్చేస్తున్నాయి. పెద్దా, చిన్నా తేడా లేదు.. వయసుతో సంబంధం అసలే లేదు. ఇక యువత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్స్ వరద పోటెత్తుతోంది. ప్రస్తుతానికి సెలబ్రిటీల దృష్టిలో పెద్దగా పడలేదు. వాళ్లు చేయడం మొదలు పెడితే మరింత ట్రెండ్ అవటం ఖాయం. అజయ్-అతుల్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను అజయ్ గోగావాలే, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటను, రీల్స్‌ముచ్చట్లను మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Modi: కాంగ్రెస్.. ఇప్పుడు తుప్పుపట్టిన ఇనుము: మోదీ తీవ్ర విమర్శలు
-
Chandrababu Arrest: చంద్రబాబు పిటిషన్లపై విచారణ ప్రారంభం
-
Siva Karthikeyan: శివ కార్తికేయన్ మూవీ.. మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్న దర్శకుడు..!
-
Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లలో మార్పుందా?
-
Canada: అందరూ చూస్తున్నారు.. పోస్టర్లు తొలగించండి..: కెనడా హడావుడి
-
IND w Vs SL w: ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణం..