balagam: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన ‘బలగం’
చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని అందుకున్న రీసెంట్ చిత్రం ‘బలగం’ (Balagam). వేణు దర్శకత్వం వహించిన ఈసినిమా తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని అందుకుంది.
హైదరాబాద్: ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు (Venu) తెరకెక్కించిన ‘బలగం’ (Balagam) చిత్రం ప్రత్యేక ఘనత సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. చలన చిత్రరంగంలో ప్రత్యేకంగా భావించే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల కార్యక్రమంలో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ విభాగానికి గాను దర్శకుడు వేణు, ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ’ విభాగానికి గాను ఆచార్య వేణు ఈ అవార్డులను దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడెక్షన్స్ ట్వీట్ చేసింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌కు అభినందనలు తెలిపింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ‘బలగం’ (Balagam) రూపుదిద్దుకుంది. గ్రామీణ వాతావరణం, బంధుత్వం, కుటుంబ విలువలు తెలియజేస్తూ తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. దిల్‌రాజు ప్రొడెక్షన్స్ పతాకంపై హర్షిత్, హన్షిత దీన్ని నిర్మించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా అంతటా మంచి టాక్ అందుకుంది. ప్రస్తుతం ఇది ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది.
బలగం రివ్యూ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Raghu Rama: నా వైద్య పరీక్షల నివేదికలను ధ్వంసం చేయబోతున్నారు
-
Ap-top-news News
Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్