Balakrishna: నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఆగయా

నందమూరి అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. గురువారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా తెరకెక్కనున్న 107వ సినిమా...

Published : 10 Jun 2021 08:47 IST

హైదరాబాద్‌: నందమూరి అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. గురువారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా తెరకెక్కనున్న 107వ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదలయ్యింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ గురించి తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ‘క్రాక్‌’ విజయం తర్వాత బాలకృష్ణ కోసం గోపీచంద్‌ మలినేని ఓ మాస్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు ఎప్పటి నుంచే వార్తలు వస్తున్న విషయం విదితమే. ఈ మేరకు 107వ చిత్రంలో బాలయ్య మాస్‌ లుక్‌లో సందడి చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

ప్రస్తుతం బాలయ్య ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ రూపుదిద్దుకుంటోంది. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇందులో బాలయ్యకు జంటగా ప్రగ్యా జైస్వాల్‌ సందడి చేయనున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ‘ఫస్ట్‌ రోరింగ్‌’ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ‘అఖండ’ పూర్తైన వెంటనే ఆయన గోపీచంద్‌ మలినేని ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టనున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని