Balakrishna: బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి సినిమా అప్‌డేట్... షూటింగ్‌ మొదలయ్యేది అప్పుడేనా?

అనిల్‌ రావిపూడితో బాలకృష్ణ ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌కు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్‌ నవంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated : 06 Oct 2022 17:10 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ ప్రస్తుతం ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌2’ తో బిజీగా ఉన్నారు. ఈ సీజన్‌ తర్వాత వరుసగా సినిమా షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా (#NBK107) టర్కీ షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయింది. ‘అన్‌స్టాపబుల్‌ 2’ అయిపోయాక బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్‌ మిగతా భాగాన్ని పూర్తి చేస్తారు. అటు అనిల్‌ రావిపూడితో బాలకృష్ణ ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌కు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్‌ నవంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించి టీమ్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు.  ఈ సినిమాకు నేపథ్య సంగీతం తమన్‌ అందిస్తున్నారట. బాలకృష్ణను ఇప్పటి వరకు చూడని లుక్‌లో చూపిస్తానని గతంలోనే అనిల్ రావిపూడి చెప్పిన సంగతి తెలిసిందే. షూటింగ్‌ ప్రారంభానికి ముందే బాలకృష్ణ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజక్టును సాహూ గారాపాటి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 2023 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని