Balakrishna: మరొకటి ముగించారు!

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ దేవోల్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు.

Published : 08 Jul 2024 01:37 IST

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ దేవోల్‌ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ షెడ్యూల్‌ పూర్తయినట్లు సమాచారం. దీనిలో భాగంగా బాలయ్యతో పాటు మిగిలిన ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిసింది. మళ్లీ ఈనెల మూడో వారం నుంచి కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానున్నట్లు చిత్రవర్గాల నుంచి వార్తలొస్తున్నాయి. ఇది దాదాపు 15రోజులకు పైగా సాగనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ శక్తిమంతమైన మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని