Tollywood: చిన్న సినిమా విజయం పరిశ్రమకు ఎంతో మేలు
చిన్న సినిమా విజయవంతమైతే... చిత్ర పరిశ్రమకి ఎంతో మేలు జరుగుతుందన్నారు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్.
చిన్న సినిమా విజయవంతమైతే... చిత్ర పరిశ్రమకి ఎంతో మేలు జరుగుతుందన్నారు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్. ఆయన ముఖ్య అతిథిగా శుక్రవారం హైదరాబాద్‌లో ‘ఐక్యూ’ విజయోత్సవం జరిగింది. సాయిచరణ్, పల్లవి జంటగా నటించిన చిత్రమిది. జి.ఎల్.బి.శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఈ సందర్భంగా వేదికపై కథానాయకుడు బాలకృష్ణ పుట్టినరోజు వేడుకని నిర్వహించారు. అనంతరం చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘కథానాయకుడు బాలకృష్ణ మా ట్రైలర్ విడుదల చేయడంతో సినిమా మరింతగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 99 థియేటర్లలో మా సినిమాని విడుదల చేశాం. రెండో వారం కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నందమూరి కథానాయకులతో త్వరలోనే సినిమా నిర్మిస్తా’’ అన్నారు. టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘‘చిన్న చిత్రాలు విజయం సాధిస్తే లక్ష్మీపతిలాంటి నిర్మాతలు మరింత మంది పరిశ్రమకి వస్తారు. ఆయన ప్రస్తుతం మరిన్ని సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నార’’న్నారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు సురేందర్‌రెడ్డి, అనంతపురం జగన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
skanda movie review: రివ్యూ స్కంద.. రామ్-బోయపాటి కాంబినేషన్ మెప్పించిందా?
-
MS Swaminathan: ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
-
ODI WC 2023: ప్రపంచకప్ స్క్వాడ్ ఫైనలయ్యేది నేడే.. ఆ ఒక్కరు ఎవరు?
-
EVs: ఈవీ కొనాలనుకుంటున్నారా? వీటినీ దృష్టిలో పెట్టుకోండి..
-
Fake News: ఎక్స్ కీలక నిర్ణయం.. నకిలీ వార్తలపై ఫిర్యాదు ఫీచర్ తొలగింపు..!
-
Manipur Violence: మణిపుర్లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్ అధికారికి పిలుపు..