Balakrishna: సామాన్యుడితో సరదాగా మాట్లాడిన బాలయ్య.. వీడియో వైరల్‌

సామాన్యుడితో సరదాగా ముచ్చటించారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Bala Krishna). కథానాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఆస్పత్రి ఛైర్మన్‌గా తాను బాధ్యతలు...

Updated : 31 Aug 2022 16:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: సామాన్యుడితో సరదాగా ముచ్చటించారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Bala Krishna). కథానాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఆస్పత్రి ఛైర్మన్‌గా తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని.. ఇలా ఇన్ని పనులు చేయడం వల్ల సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. బాలయ్య మాటలతో ఆ వ్యక్తి, అతడి కుటుంబం ఆనందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. దాన్ని చూసిన నెటిజన్లు బాలయ్య సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూట్‌ కోసం బాలయ్య ఇటీవల టర్కీ వెళ్లిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజులపాటు చిత్రబృందం ఇక్కడే ఉండనుంది. ఈ క్రమంలో బాలయ్య టర్కీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ కుటుంబంతో కలిసి టిఫిన్‌ చేసి.. కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు. ‘‘హే భాయ్‌.. టీఫిన్‌ చేసేశా. ఇక, మందులు వేసుకునే సమయమైంది. ఓవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఇలా ఇన్ని పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చునేవాళ్లకి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి’’ అని బాలయ్య చెప్పారు.

అనంతరం అక్కడే ఉన్న మహిళను చూపించి.. ‘‘వీళ్లు ఇంట్లో కూర్చొని ధారావాహికలు చూస్తుంటారు. మైండ్‌ పాడుచేసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిది. అసలు చూడకపోతే మెదడుకి మంచిది’’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఆయన మాటలతో ఆ కుటుంబం నవ్వుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బాలయ్యని మెచ్చుకుంటున్నారు. అగ్రకథానాయకుడు అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా సామాన్యులతో ఆయన ప్రవర్తించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని