ఓ ప్రజానాయకా.. తెలుగుతల్లి పాడుతోంది నీ గీతిక:ఎన్టీఆర్‌ పాటపై బాలయ్య స్పందన

దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామ రావు జీవితంపై ఇటీవల ఓ ప్రత్యేక పాట విడుదలైంది. అశ్విన్‌ అట్లూరి రచించిన ఈ పాటకు ఎస్కే బాజీ సంగీతం సమకూర్చారు. అంజనా సౌమ్య, స్వరాగ్‌ ఆలపించారు. తాజాగా ఈ పాటపై ఎన్టీఆర్‌ తనయుడు

Published : 21 Jan 2022 18:13 IST

హైదరాబాద్‌: తెలుగు వెండితెరపై ధ్రువతారగా వెలిగిన నటుడు.. నందమూరి తారకరామ రావు. సినీరంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఆయన జీవితాన్ని రచయిత, నిర్మాత అశ్విన్‌ అట్లూరి పాట రూపంలో ఆవిష్కరించారు. ఈ పాటకు ఎస్కే బాజీ సంగీతం సమకూర్చారు. అంజనా సౌమ్య, స్వరాగ్‌ ఆలపించారు. తాజాగా ఈ పాటపై ఎన్టీఆర్‌ తనయుడు, నటుడు బాలకృష్ణ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.

‘‘నవరస నటనా సార్వభౌమ, రాజకీయ భీష్మ, ప్రజాభీష్ట నందమూరి తారక రామ మహాప్రస్థానాన్ని పాటగా రచించి, నిర్మించిన అశ్విన్ అట్లూరి గారికి.. వారి బృందానికి నా అభినందనలు. ‘నందమూరి తారక రామామృత’ గీతాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న అన్నగారి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు’’అని సోషల్‌మీడియా పోస్టులో బాలకృష్ణ పేర్కొన్నారు. ఓ ప్రజానాయకా.. తెలుగుతల్లి పాడుతుంది నీ గీతిక అంటూ.. ఆ పాటను జత చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని