Unstoppable: అక్కినేని నాగేశ్వరరావులా మారిన బాలయ్య.. డైలాగ్‌ అదుర్స్‌!

తెలుగు సినీ పరిశ్రమలోని గొప్ప నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. జీవితాంతం ఆయన కళామతల్లి సేవలోనే తరించారు. వెండితెరపై ఆయన ఆహార్యం, నటన, డైలాగులు చెప్పే విధానం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అందుకే, మిమిక్రీ ఆర్టిస్టులు నాగేశ్వరరావు గొంతును అనుకరిస్తుంటారు. తాజాగా

Published : 06 Dec 2021 22:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినీ పరిశ్రమలోని గొప్ప నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. జీవితాంతం ఆయన కళామతల్లి సేవలోనే తరించారు. వెండితెరపై ఆయన ఆహార్యం, నటన, డైలాగులు చెప్పే విధానం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అందుకే, మిమిక్రీ ఆర్టిస్టులు నాగేశ్వరరావు గొంతును అనుకరిస్తుంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణ.. అక్కినేని నాగేశ్వరరావు గొంతును అనుకరించి అందరినీ ఆశ్చర్యపర్చారు.

ఆహాలో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ కార్యక్రమానికి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ప్రసారమైన మూడో ఎపిసోడ్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. దర్శకుడు అనిల్‌ రావిపూడి అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. కార్యక్రమం మధ్యలో ‘నాగేశ్వరరావు గొంతును అనుకరించండి చూద్దాం’ అంటూ బాలయ్యకు బ్రహ్మానందం సవాల్‌ విసిరారు. దీంతో ఆయన ఏ మాత్రం తడుముకోకుండా నాగేశ్వరరావు గొంతును అనుకరిస్తూ.. పౌరాణిక సంభాషణలను అనర్గళంగా చెప్పేశారు. అది చూసి బ్రహ్మానందం, అనిల్‌ రావిపూడి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది. నాగేశ్వరరావు గొంతును భలే అనుకరించారంటూ బాలయ్యపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వెండితెరపై అయినా.. బుల్లితెరపై అయినా బాలయ్య ఎనర్జీ లెవల్స్‌ ఏ మాత్రం తగ్గవని కామెంట్లు చేస్తున్నారు. 

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని