Balakrishna: చిన్న దర్శకుడితో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధమైన బాలకృష్ణ..!
ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఓ ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
హైదరాబాద్: టాలీవుడ్‌లో మాస్, యాక్షన్ చిత్రాలు అనగానే గుర్తుకువచ్చే పేరు బాలకృష్ణ. ప్రయోగాత్మక సినిమాల్లో అయినా.. పౌరాణిక చిత్రల్లోనైనా తనదైన శైలిలో నటించగల బాలయ్య కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంలోనూ ముందుంటారు. ప్రస్తుతం అఖండ బ్లాక్‌బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరసింహారెడ్డి(Veerasimha Reddy) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వరస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా ఓ చిన్న దర్శకుడి కథను ఓకే చేశారట. కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు వెంకటేశ్ మహ ఇటీవల ఓ స్క్రిప్ట్ వినిపించారని.. బాలయ్యకు అది బాగా నచ్చిందంటున్నాయి ఫిల్మినగర్ వర్గాలు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా అలరించనుందంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశం ఉందంటున్నారు. ఇక వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Raveena Tandon: అక్షయ్‌తో బ్రేకప్.. దాదాపు పాతికేళ్ల తర్వాత పెదవి విప్పిన నటి
-
World News
Turkeys earthquake: తుర్కియేలో భూకంప పన్ను ఏమైంది..? ప్రజల ఆగ్రహం..!
-
Sports News
IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్
-
Movies News
Social Look: రుహానీ శర్మ రెడ్ రోజ్.. ప్రణీతకు బోర్ కొడితే?
-
World News
Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
-
India News
Transcouple: తల్లిదండ్రులైన ట్రాన్స్జెండర్ల జంట