Balakrishna: మోక్షజ్ఞ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఎంతోకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటుడిగా ఆయన పరిచయం కానున్నారని పలు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా వార్తలపై బాలకృష్ణ స్పందించారు.
హైదరాబాద్: తన తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna) ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna). గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య చెప్పలేదు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను లాంచ్ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతా దైవేచ్ఛ’’ అని నవ్వి ఊరుకున్నారు.
అనంతరం అఖండ-2’పై స్పందించారు. ‘‘అఖండ-2’ తప్పకుండా ఉంటుంది. సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశాం. ప్రకటించడం ఒకటే మిగిలింది. సమయం చూసి ప్రకటిస్తాం’’ అని బదులిచ్చారు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇటీవల ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మేరకు చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. ఇక, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ సినిమా చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
Politics News
రాహుల్.. నేటి కాలపు మీర్ జాఫర్!.. భాజపా నేత సంబిత్ పాత్ర విమర్శ
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా