30 years of Rowdy Inspector: ఆ జీపు పంపిస్తేనే షూటింగ్‌కి వస్తానన్న బాలకృష్ణ!
నందమూరి బాలకృష్ణ - బి.గోపాల్ది సూపర్ హిట్ కాంబినేషన్. వారిద్దరి కలయికలో వచ్చిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’(Rowdy Inspector) బంపర్ హిట్ సినిమా.
ఇంటర్నెట్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ - బి.గోపాల్ది సూపర్ హిట్ కాంబినేషన్. వారిద్దరి కలయికలో వచ్చిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’(Rowdy Inspector) బంపర్ హిట్ సినిమా. ఆ రోజుల్లోనే మాస్‌ను ఓ ఊపు ఊపేసిన ఆ సినిమా బద్దలు కొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. మే 7, 1992న విడుదలైన ఈ సినిమా శనివారంతో 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘రౌడీ ఇన్స్పెక్టర్’ షూటింగ్లో సమయంలో జరిగిన ఓ ఆసక్తికర విశేషం మీకోసం..
పోలీసు కథా నేపథ్య సినిమాల్లో ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ఓ ట్రెండ్ సెట్టర్. బాలకృష్ణను పోలీసు దుస్తుల్లో చూసి అభిమానులు మురిసిపోతే... ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు అదుర్స్ అన్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు... జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ బాలయ్య ఆ పాత్రలో లీనమైపోతారు. అలానే ‘రౌడీ ఇన్స్పెక్టర్’ చిత్రీకరణ సమయంలో పోలీసులానే ఫీలయ్యారు. అలా రోజూ సినిమాలో వాడిన జీపులో చిత్రీకరణకు వచ్చేవారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బి.గోపాల్ ఓ సందర్భంలో చెప్పారు.
‘‘ఓ రోజు ఉదయం బాలయ్య బాబు ఫోన్ చేసి ఈ రోజు నేను చిత్రీకరణకు రావడం లేదు’ అన్నారు. ‘ఏమైంది బాబూ’ అనడిగితే.. ‘సినిమాలో నేను వాడుతున్న జీపు పంపిస్తే అందులోనే షూటింగ్‌కి వస్తా.. అప్పుడే ఆ పాత్రలో లీనమవ్వగలను’ అని చెప్పారు. మేం అలానే జీపు పంపించాం. ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య బాబు ఆ రోజు పోలీసు జీపులో పోలీసులా కాలు బయట పెట్టి.. లాఠీ తిప్పుతూ వచ్చారు. సినిమా అంటే అంత ప్యాషన్ ఆయనకి. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ అలానే వచ్చారు’’ - బి.గోపాల్, ప్రముఖ దర్శకుడు
రౌడీ ఇన్స్పెక్టర్ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు..
- ‘లారీ డ్రైవర్’ తర్వాత బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్లో ఓ సినిమాకి ప్లాన్ చేశారు నిర్మాత టి.త్రివిక్రమరావు
- ముందుగా ‘బొబ్బిలి సింహం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, ఆ టైటిల్‌కి కథని ప్లాన్ చేశారు. ఆ సమయంలో దర్శకుడు బి.గోపాల్ తమిళ్ చిత్రం చిన్నతంబి చూసి దానిని రీమేక్ చేద్దామనుకున్నారు. బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అప్పటికే కె.ఎస్.రామారావు ఆ సినిమా హక్కులు కొని, వెంకటేశ్ కథానాయకుడిగా ‘చంటి’పేరిట తీస్తున్నారని తెలిసింది.
- ఆ తర్వాత రకరకాల కథలు అనుకున్నారు. కానీ ఏది ఫైనల్ కాలేదు. చివరికి రచయిత పుష్పానంద్ ఓ కథతో ముందుకు వచ్చారు అదే రౌడీ ఇన్స్పెక్టర్
- హీరోయిన్గా విజయశాంతిని, సంగీత దర్శకుడిగా బప్పీలహరిని తీసుకున్నారు. బాలయ్య పుట్టిన రోజున దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి క్లాప్‌తో ‘రౌడీ ఇన్స్పెక్టర్’ మొదలైంది.
- ముందుగా సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ఫైనల్‌గా మేలో రిలీజ్ అయింది. దాదాపు రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ మూవీకి ఫస్ట్ డే నుంచి మంచి టాక్ వచ్చింది.
- రెండు వారాల్లోనే రెండు కోట్లు వసూళ్లు చేయడం విశేషం. మొత్తం మీద రూ.9 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
- అప్పట్లో 60 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం. 22 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకొంది.
- ఈ సినిమా తర్వాత డైలాగ్స్ అంటే బాలయ్య.. బాలయ్య అంటేనే డైలాగ్స్ అన్నట్టుగా మారిపోయింది.
- ఈ చిత్రాన్ని హిందీలో ఇదే పేరుతో డబ్చేయగా, తమిళంలో విజయశాంతికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘ఆటో రాణి’గా అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం.
- ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ఈ రెండు చిత్రాల్లోనూ విజయశాంతి హీరోయిన్ కావడం మరో విశేషం.
- ఈ సినిమాకు ముందుగా అనుకున్న ‘బొబ్బలి సింహం’ టైటిల్‌తోనే బాలయ్యతో మరో సినిమాను తెరకెక్కించారు నిర్మాత త్రివిక్రమరావు. మరో విశేషం ఏంటంటే ‘రౌడీ ఇన్స్పెక్టర్’కు క్లాప్ కొట్టిన కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్‌కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్‌కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే?
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్‌ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ