ఆ కారు పంపిస్తేనే షూటింగ్‌కి వస్తానన్న బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ - బి.గోపాల్‌ది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వారిద్దరి కలయికలో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ బంపర్‌ హిట్‌ సినిమా. ఆ రోజుల్లోనే

Published : 14 Dec 2020 19:28 IST

నందమూరి బాలకృష్ణ - బి.గోపాల్‌ది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వారిద్దరి కలయికలో వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ బంపర్‌ హిట్‌ సినిమా. ఆ రోజుల్లోనే మాస్‌ను ఓ ఊపు ఊపేసిన ఆ సినిమా బద్దలు కొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి సినిమా చిత్రీకరణకు రావడానికి బాలకృష్ణ  ఓ కండిషన్‌ పెట్టారంటే నమ్ముతారా. అదేంటి.. బాలయ్య దర్శకుల హీరో కదా... అలాంటి ఇబ్బందులేం పెట్టడంటారే అనుకుంటున్నారా? ఆ షరతు ఏంటో తెలిస్తే బాలకృష్ణ నటన మీద ఉన్న ప్యాషన్‌ ఏంటో తెలుస్తుంది. అది ఆ సినిమా హిట్‌ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది కూడా.

పోలీసు నేపథ్య సినిమాల్లో ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. బాలకృష్ణను పోలీసు దుస్తుల్లో చూసి అభిమానులు మురిసిపోతే...  ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులు అదుర్స్‌ అన్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్‌ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు... జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ బాలయ్య ఆ పాత్రలో లీనమైపోతారు. అలానే ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ చిత్రీకరణ సమయంలో పోలీసులానే ఫీలయ్యారు. అలా రోజూ సినిమాలో వాడిన జీపులో చిత్రీకరణకు వచ్చేవారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బి.గోపాల్‌ ఓ సందర్భంలో చెప్పారు.

ఓ రోజు ఉదయం బాలయ్య బాబు ఫోన్‌ చేసి ఈ రోజు నేను చిత్రీకరణకు రావడం లేదు అన్నారు. ఏమైంది బాబూ అనడిగితే.. సినిమాలో నేను వాడుతున్న జీపు పంపిస్తే అందులోనే షూటింగ్‌కి వస్తా.. అప్పుడు ఆ పాత్రలో లీనమవ్వగలను అని చెప్పారు. మేం అలానే జీపు పంపించాం. ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య బాబు ఆ రోజు పోలీసు జీపులో పోలీసులా కాలు బయట పెట్టి.. లాఠీ తిప్పుతూ వచ్చారు. సినిమా అంటే అంత ప్యాషన్‌ ఆయనకి. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ అలానే వచ్చారు - బి.గోపాల్‌, ప్రముఖ దర్శకుడు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని