Balakrishna: ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు.. అభిమానులకు బాలయ్య కృతజ్ఞతలు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల్లో పాల్గొంటున్న అభిమానులందరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు............

Published : 27 May 2022 22:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల్లో పాల్గొంటున్న అభిమానులందరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న వారంతా ఈ వేడుకలను జరుపుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఏడాది పొడువునా కొనసాగే ఈ ఉత్సవాల్లో అభిమానులతోపాటు తమ కుటుంబ సభ్యులూ పాల్గొంటారన్నారు. నటుడిగా, రాజకీయ నేతగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలను మే 28న నిమ్మకూరులో బాలకృష్ణ ప్రారంభించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం గుంటూరు, సాయంత్రం తెనాలిలో జరగనున్న కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని