Balakrishna: తొడ కొట్టడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ని..: బాలకృష్ణ

తాను తొడ కొట్టడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ను అని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన వ్యాఖ్యాతగా

Published : 26 Nov 2021 01:52 IST

హైదరాబాద్‌: తాను తొడ కొట్టడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ను అని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన వ్యాఖ్యాతగా తెలుగు ఓటీటీలో ప్రసారమవుతున్న షో ‘అన్‌స్టాపబుల్‌’. ఇప్పటికే మోహన్‌బాబు, నానిలు ఈ షోకు వచ్చి సందడి చేశారు. నానితో చిట్‌చాట్‌ సందర్భంగా జరిగిన ఆసక్తికర సన్నివేశాల వీడియోను ఆహా పంచుకుంది. ‘సర్‌ చివరిలో తొడ కొట్టాలి’ అని నాని అడిగితే, ‘తొడ కొట్టడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ని. సినిమా ఫంక్షన్‌, రాజకీయంగా ప్రచారానికి వెళ్లినా, ‘గురువుగారు తొడకొట్టండి’ అని అంటారు. ‘ఇప్పుడెందుకు రా ఇవన్నీ’ అంటే ఒప్పుకోరు’’ అని బాలకృష్ణ అన్నారు. ఇక ‘మీకు బాలయ్యగారితో నటించే అవకాశం వస్తే ఏ రోల్‌ సెలక్ట్‌ చేసుకుంటారు’ అని అడగ్గా ‘సినిమా కథ రెడీగా ఉందా’ అని బాలకృష్ణ ప్రశ్నించారు. అందుకు నాని సమాధానం ఇస్తూ ‘గాడ్‌ ఫాదర్‌లో ఆయన బ్రాండో అయితే, అల్‌పిచినో రోల్‌ చేస్తా’  అని అన్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని