Veera Simha Reddy Review: రివ్యూ: వీరసింహారెడ్డి
Veera Simha Reddy review: నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) ఎలా ఉందంటే..?
Veera Simha Reddy review; చిత్రం: వీరసింహారెడ్డి; నటీనటులు: బాలకృష్ణ, శ్రుతిహాసన్, హనీరోజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, మురళీ శర్మ, సప్తగిరి, తదితరులు; సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ; ఎడిటింగ్: నవీన్ నూలి; సంగీతం: తమన్; మాటలు: సాయి మాధవ్ బుర్రా; నిర్మాణ సంస్థ: మైత్రిమూవీ మేకర్స్; నిర్మాతలు: నవీన్ ఏర్నేని, రవి శంకర్; కథ, కథనం, దర్శకత్వం: గోపీచంద్ మలినేని; విడుదల తేదీ: 12-01-2023
కొవిడ్ భయాలతో థియేటర్లు కళ తప్పిన వేళ ‘అఖండ’తో బాలకృష్ణ, ‘క్రాక్’తో గోపీచంద్ మలినేని నూతనోత్తేజాన్ని అందించారు. సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. చిత్రసీమకు కొత్త కళ తీసుకొచ్చారు. అందుకే ఇలాంటి అపురూప కలయికలో ఓ సినిమా పట్టాలెక్కిందనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ బాలకృష్ణకు గోపీచంద్ వీరాభిమాని. ఫ్యాన్స్ బాలయ్య నుంచి ఏం కోరుకుంటారో.. వాళ్లకు ఆయన్ని ఎలా చూపించాలో బాగా తెలుసు. ఈ లెక్కలకు తగ్గట్లుగానే ఆయన రెండు పాత్రలతో కూడిన ఓ మాస్ కమర్షియల్ కథతో బాలకృష్ణను ‘వీరసింహారెడ్డి’గా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి పాటలు, ప్రచార చిత్రాలతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో ఎలాంటి వినోదాలు పంచిచ్చింది? (veera simha reddy review) బాలయ్య యాక్షన్ హంగామా మరోసారి సినీప్రియుల్ని మెప్పించిందా? గోపీచంద్ మలినేని ప్రయత్నం ఫలించిందా?
కథేంటంటే: జై అలియాస్ జై సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ) (Balakrishna), ఆయన తల్లి మీనాక్షి (హనీ రోజ్) ఇస్తాంబుల్‌లో జీవిస్తుంటారు. ఓ అనుకోని సంఘటన వల్ల జైకు ఈషా (శ్రుతి హాసన్) (shruti haasan) దగ్గరవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్లికి సిద్ధమవుతారు. ఈ విషయాన్ని ఈషా తన తండ్రి (మురళీ శర్మ)తో చెప్పగా.. దానికి అతను కూడా ఒప్పుకొంటాడు. సంబంధం గురించి మాట్లాడటానికి జై తల్లిదండ్రుల్ని ఇంటికి రమ్మని చెబుతాడు. అప్పటి వరకు తండ్రి లేడని అనుకుంటున్న జైకు తన తల్లి ఓ నిజం చెబుతుంది.(veera simha reddy review) జనం మీద ప్రేమతో.. సీమపైన అభిమానంతో ఊరి బాగు కోసం కత్తి పట్టిన గొప్ప నాయకుడు, తన బావ వీరసింహారెడ్డి (బాలకృష్ణ)కి పుట్టిన బిడ్డవని చెబుతుంది. తమ కొడుకు పెళ్లి విషయమై మాట్లాడటానికి ఇస్తాంబుల్ రమ్మని వీరసింహకు మీనాక్షి కబురు పంపుతుంది. అయితే వీరా సీమ వదిలి ఇస్తాంబుల్ వెళ్లాడని తెలుసుకున్న ప్రత్యర్థి ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) అతన్ని చంపేందుకు తన భార్య భాను (వరలక్ష్మీ శరత్ కుమార్)తో కలిసి అక్కడికి వెళ్తాడు. ఇంతకీ ఆ భాను మరెవరో కాదు.. వీరసింహారెడ్డికి స్వయానా చెల్లెలు. ఎన్నో ఏళ్లుగా తన అన్న చావు చూడాలని పగతో రగిలిపోతుంటుంది. అందుకే ఏరికోరి అతని శత్రువు ప్రతాప్ రెడ్డిని పెళ్లి చేసుకుంటుంది. మరి వీరసింహారెడ్డిని చంపేందుకు ఇస్తాంబుల్ వెళ్లిన ప్రతాప్ రెడ్డి, భాను తాము అనుకున్నది సాధించారా? (veera simha reddy review) అసలు తన అన్నను చంపాలని భాను ఎందుకు పగ పట్టింది? ప్రతాప్ రెడ్డికి అతనికి ఉన్న విరోధం ఏంటి? వీర సింహా రెడ్డి, మీనాక్షి విడిపోవడాని కారణమేంటి? తన తండ్రి గతం తెలుసుకున్న జై శత్రువులకు ఎలా బుద్ధి చెప్పాడు? అన్నది మిగతా కథ.
ఎలా సాగిందంటే: ఫ్యాక్షన్ కథలకు చిరునామా బాలకృష్ణ. (Balakrishna) సమరసింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి, నరసింహానాయుడు వంటి ఎన్నో విజయవంతమైన సీమ కథలతో సినీప్రియుల్ని ఉర్రూతలూగించారు. ఇప్పుడొచ్చిన ఈ వీరసింహారెడ్డి కూడా ఈ తరహా కథాంశంతో రూపొందిన చిత్రమే. కాకపోతే ఈసారి ఈ ఫ్యాక్షన్ యాక్షన్ కథకు చెల్లి సెంటిమెంట్‌ను జోడించి కొత్తదనం అందించే ప్రయత్నం చేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఊరు బాగు కోసం కత్తి పట్టిన అన్న.. అతన్ని చంపి పగ తీర్చుకోవాలని 30ఏళ్లుగా ఎదురు చూసే చెల్లి.. ఈ పాయింటే చాలా ఆసక్తికరం. అయితే దీని వెనకున్న ఆసక్తికర కథేంటో తెలియాలంటే.. ప్రధమార్ధంలోని ఫ్యాక్షన్ యాక్షన్ హంగామాను రుచి చూడాలి. (veera simha reddy review) వీరసింహారెడ్డిలో ప్రథమార్ధంలో కథ పెద్దగా కనిపించదు. ఓ శక్తిమంతమైన ఎలివేషన్‌తో ప్రతినాయకుడ్ని పరిచయం చేయడం.. ఆ వెంటనే అంతకంటే శక్తిమంతమైన యాక్షన్ ఎపిసోడ్‌తో ఇస్తాంబుల్‌లో జై పాత్ర పరిచయమవడం చకచకా జరిగిపోతాయి. ఈషా పాత్ర పరిచయ సన్నివేశాలు కాస్త విసిగిస్తాయి. ఆమె జైతో ప్రేమలో పడటం.. వారిద్దరి పెళ్లికి ఈషా తండ్రి పచ్చజెండా ఊపడం.. ఆ తర్వాత జైకు అతని తల్లి గతం చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక వీరసింహారెడ్డి పాత్ర పరిచయమైనప్పటి నుంచి ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లతో థియేటర్ మోత మోగిపోతుంది. ప్రతాప్ రెడ్డి గజనీ మహమ్మద్‌లా పదే పదే వీరసింహారెడ్డిపైకి తన బలగంతో విరుచుకుపడటం.. అతని చేతిలో తుక్కు తుక్కుగా కొట్టించుకొని ఇంటికెళ్లి పెళ్లాంతో చీవాట్లు తినడం ఇదే తంతు. అయితే వీళ్ల మధ్యలో వచ్చే ప్రతి పోరాట ఘట్టాన్నీ వావ్ అనేలా తీర్చిదిద్దారు రామ్-లక్ష్మణ్. ముఖ్యంగా పెళ్లి వేడుకలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, కుర్చీలో కూర్చొనే ప్రతాప్ రెడ్డి గ్యాంగ్‌ని వీరసింహారెడ్డి చీల్చి చెండాడే ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను చక్కటి ట్విస్ట్‌తో ద్వితీయార్ధంపై అంచనాలు పెంచేలా తీర్చిదిద్దారు.
సెకండాఫ్‌లో వీరసింహారెడ్డికి అతని చెల్లికి మధ్య ఉన్న అనుబంధాన్ని.. అది పగగా మారడానికి వెనకున్న కారణాన్ని చూపించారు. దీంతో పాటు ప్రతాప్ రెడ్డికి వీరసింహారెడ్డికి ఉన్న విరోధాన్నీ ఆసక్తికరంగా చూపించారు. అయితే వీటన్నింటినీ తెరపై చూసి ఆస్వాదిస్తేనే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో సెకండాఫ్‌లో నాలుగు పాటలు, ఫైట్లున్న చిత్రాలేవీ రాలేదు.(veera simha reddy review) ఆలోటును వీరసింహారెడ్డి తీర్చుతుంది. జైబాలయ్య పాటను దానికి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ను తీర్చిదిద్దిన తీరు బాగుంది. మా బావ మనోభావాలు పాటను కూడా సరైన సందర్భంలో సెట్ చేశారు. వీరసింహారెడ్డి - మీనాక్షిల మధ్య వచ్చే రెండు మూడు ప్రేమ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. అయితే వాళ్ల లవ్ ట్రాక్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుని ఉంటే బాగుండనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో యాక్షన్ హంగామా సినీప్రియుల్ని అలరిస్తుంది.
ఎవరెలా చేశారంటే: వీరసింహారెడ్డిగా బాలకృష్ణ (Balakrishna) వెండితెరపై విశ్వరూపం చూపించారు. ఆ పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆ పాత్ర కనిపిస్తున్నంత సేపు ప్రేక్షకులు చూపు పక్కకు తిప్పుకోలేరు. ఆ పాత్రలోని హీరోయిజానికి తగ్గట్లుగా రాసుకున్న శక్తిమంతమైన సంభాషణలు, తీర్చిదిద్దిన పోరాట ఘట్టాలు ఆద్యంతం అలరిస్తాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు మూడు చోట్ల తూటాల్లాంటి మాటలు పేలాయి. (veera simha reddy review) బాలకృష్ణలోని హీరోయిజాన్ని తన కలంతో ప్రతి పదంలోనూ గుప్పించారు సాయిమాధవ్ బుర్రా. జై పాత్ర సినిమా ఆరంభంలోనూ.. సెకండాఫ్‌లోనూ ఆకట్టుకుంటుంది. మధ్యలో ఆ పాత్ర ఎక్కడా కనిపించదు.
శ్రుతిహాసన్ (shruti haasan) పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లా రెండు పాటలు, మూడు సన్నివేశాలకే పరిమితమైంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. పగతో రగిలే చెల్లిగా.. అంతకు ముందు అన్నయ్యను ప్రేమించే వ్యక్తిగా చక్కటి వేరియేషన్ చూపించింది. హనీరోజ్ పాత్ర ఫర్వాలేదనిపిస్తుంది. (veera simha reddy review) ప్రతాప్ రెడ్డిగా దునియా పాత్రను తీర్చిదిద్దుకున్న విధానం కూడా బాగుంది. అయితే ఆయనలోని విలనిజాన్ని ఆహార్యానికి.. అరుపులకు మాత్రమే పరిమితం చేసినట్లు అనిపిస్తుంది. బ్రహ్మానందం, అలీ అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు. కానీ, నవ్వించలేకపోయారు. నవీన్‌చంద్ర, ఈశ్వరీరావు, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోష్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. గోపీచంద్ మలినేని బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కమర్షియల్ కొలతలతో ఈ కథ సిద్ధం చేసుకున్నారు. సినిమాలో యాక్షన్, ఎలివేషన్లపై పెట్టిన శ్రద్ధ కథపై అంతగా పెట్టలేదు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చాయి. రామ్-లక్ష్మణ్ పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు: + వీరసింహారెడ్డిగా బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్; + పోరాట ఘట్టాలు, పాటలు; + సాయిమాధవ్ బుర్రా సంభాషణలు
బలహీనతలు: - రొటీన్ యాక్షన్ డ్రామా, మితిమీరిన హింస
చివరిగా: బాలకృష్ణ అభిమానులకు పండగ లాంటి చిత్రం వీరసింహారెడ్డి (veera simha reddy review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఇది 140 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం.. : కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
NTR 100th Birth Anniversary: రాజకీయాలు, సినీ జగత్తులో ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు: మోదీ
-
World News
USA: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై సూత్రప్రాయంగా ఒప్పందం
-
Sports News
Shubman Gill: కోహ్లీ, రోహిత్ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Movies News
keerthy suresh: కీర్తి సురేశ్ పెళ్లిపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తండ్రి