Hit2: మోక్షజ్ఞతో కలిసి ‘హిట్2’ చూసిన బాలకృష్ణ..
అడివి శేష్, నాని హిట్2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన బాలకృష్ణ చిత్రబృందాన్ని అభినందించారు.
హైదరాబాద్: అడివి శేష్(Adivi Sesh) హీరోగా నటించిన హిట్2(HIT2) సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సోషల్‌మీడియా వేదికగా అభినందనల వెల్లువ కొనసాగుతోంది. సాధారణ ప్రేక్షకుల నుంచి అగ్రస్థాయి సెలబ్రిటీల వరకు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అద్భుతమైన స్ర్కీన్‌ప్లేతో ఉత్కంఠ రేపే మలుపులతో ఆసక్తికరంగా ఉందంటూ టీంను పొగుడుతున్నారు. తాజాగా బాలకృష్ణ(Balakrishna) ఈ సినిమాను చూసి చిత్రబృందాన్ని అభినందించారు. మోక్షజ్ఞతోపాటు హిట్2 చూసిన ఆయన చిత్ర బృందంతో కలిసి సందడి చేశారు.
‘బాలకృష్ణగారికి హిట్2 సినిమా చాలా నచ్చింది. దర్శకుడు శైలేష్ కొలను విజన్‌ను, నా నటనను ఆయన ప్రశంసించారు. హిట్ సిరీస్‌లో ఒకసారి కనిపించాలని బాలయ్యని సరదాగా అడిగాను’ అంటూ ఆయనతో దిగిన ఫొటోలను అడవి శేష్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాపై యంగ్ హీరో సుధీర్ బాబు కూడా స్పందించారు. హిట్2 సినిమా చాలా బాగుందని, మంచి విజయాన్ని అందుకున్నందుకు చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. సినిమాను బాగా ఎంజాయ్ చేశాను అంటూ సరదా వీడియోను షేర్ చేశాడు. ట్విటర్ వేదికగా సుధీర్ బాబు(Sudheer Babu)కు అడివిశేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇక హీరో నాని(Nani) సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’పై వచ్చిన ఈ చిత్రం తొలి రోజునుంచే భారీ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/02/23)
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. ఫిబ్రవరి రెండో వారంలోనే వేలం!
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
Politics News
CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్‌తో అమిత్ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ