Updated : 01 Jul 2022 06:51 IST

Balakrishna: బరిలోకి బాలయ్య..!

కథానాయకుడు బాలకృష్ణ(Balakrishna) కరోనా (COVID) నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజాగా చేసిన కొవిడ్‌ టెస్ట్‌లో ఆయనకు నెగటివ్‌ వచ్చింది. అయితే వైద్యుల సూచన మేరకు ఈవారం విశ్రాంతి తీసుకోనున్నారు. వచ్చే వారం నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. బాలయ్య (NBK 107) ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ (Shruthi Haasan) కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు తెలిసింది. వాస్తవ సంఘటనలతో అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో.. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ముస్తాబు చేస్తున్నారు. దీనికి తమన్‌(Thaman) స్వరాలందిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని