Bandla Ganesh: ఆ హిట్‌ రీమేక్‌తో హీరోగా మారబోతున్న బండ్ల గణేశ్‌

Bandla Ganesh: కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా, చివరకు రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్రవేసిన బండ్ల గణేశ్‌ త్వరలో హీరోగా అలరించనున్నారు

Updated : 20 Aug 2021 16:55 IST

హైదరాబాద్‌: నటుడు బండ్ల గణేశ్‌ త్వరలో ఓ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా, చివరకు రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్రవేసిన ఆయన త్వరలో కథానాయకుడిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ బండ్ల గణేశ్‌ కథానాయకుడిగా నటించే చిత్రమేంటో తెలుసా? తమిళంలో ఘన విజయం సాధించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఒత్త సెరుప్పు అళవు7’(సింగిల్‌ స్లిప్పర్‌ సైజ్-7) పార్తిబన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఒకే ఒక క్యారెక్టర్‌తో సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు పార్తిబన్‌. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో అభిషేక్‌ బచ్చన్‌ రీమేక్‌ చేస్తున్నారు. కాగా, తెలుగులో బండ్ల గణేశ్‌ ఈ క్యారెక్టర్‌ పోషించనున్నారు. ఈ చిత్రానికి వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబరు మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని