Updated : 23 Jun 2022 19:55 IST

Bandla Ganesh: పూరీ.. అందర్నీ స్టార్స్‌ చేశావ్‌.. నీ కొడుకుని మాత్రం ఇలా..: బండ్ల గణేశ్‌

షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన నిర్మాత

హైదరాబాద్‌: ‘‘ఎంతోమందిని స్టార్‌ హీరోలను చేసిన పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh).. తన తనయుడు ఆకాశ్‌పూరీ (Akashpuri) సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి రాకపోవడం బాధగా ఉంది’’ అని అన్నారు బండ్ల గణేశ్‌(Bandla Ganesh). ఆకాశ్ హీరోగా నటించిన యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చోర్‌ బజార్‌’(Chor Bazaar). జీవన్‌రెడ్డి దర్శకుడు. జూన్‌ 24న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ‘చోర్‌ బజార్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. అతి తక్కువ మంది సినీ ప్రియులు, అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో పరశురామ్‌, బండ్ల గణేశ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

కాగా, ఈ ఈవెంట్‌లో భాగంగా బండ్లగణేశ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. పూరీ సతీమణి లావణ్య ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, పిల్లల భవిష్యత్తు కోసమే ఆమె బతుకుతుందని ఆయన వ్యాఖ్యానించారు.  ‘‘మా వదిన లావణ్య కోసమే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చాను. ఆమె అంటే నాకెంతో గౌరవం. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో.. వదినమ్మ అంటే కూడా అంతే అభిమానం. సీతాదేవికి ఉన్నంత సహనం, ఓర్పు మా వదినమ్మలో ఉన్నాయి. పూరీ దగ్గర ఏం లేనప్పుడే.. ఆయన్ను ప్రేమించి ఆయనపై ఉన్న నమ్మకంతో ఇంట్లో నుంచి వచ్చేసి.. సనత్‌నగర్‌ గుడిలో పెళ్లి చేసుకుంది. పూరీ.. ఎంతోమందిని స్టార్స్‌ చేశాడు. కానీ సొంత కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాకుండా ఎక్కడో ముంబయిలో ఉన్నాడు.

ఒకవేళ ఇదే పరిస్థితిలో నేను ఉండుంటే నా కొడుకు కోసం అన్ని పనులు మానుకుని మరీ వచ్చేసేవాడిని. అన్నా.. ఇంకోసారి ఇలా చేయకు నీకు దణ్ణం పెడతా. ఎందుకంటే మనం ఏం సంపాదించినా భార్యాపిల్లల కోసమే. వాళ్ల బాధ్యత మనదే. చచ్చేదాకా వాళ్లను వదలకూడదు. నాలాంటి వాడిని స్టార్‌ ప్రొడ్యూసర్‌ని చేసి నీ కొడుకుని స్టార్‌ని చేయకుండా నువ్వు ముంబయిలో కూర్చొంటే మేము ఒప్పుకోం.  ‘చోర్‌బజార్‌’లో నీ కొడుకు అదరగొట్టేశాడు. నువ్వు చేసినా చేయకున్నా నీ కొడుకు స్టార్‌ అవుతాడు. నీ కొడుకు డేట్స్‌ కోసం నువ్వు క్యూలో నిల్చునే రోజులు తప్పకుండా వస్తాయ్‌’’ అని బండ్ల గణేశ్‌ వైరల్‌ కామెంట్స్‌ చేశారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని