Bangarraju: ‘బంగార్రాజు’ హంగామా..

నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటించిన ‘బంగార్రాజు’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated : 10 Jan 2022 07:03 IST

నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటించిన ‘బంగార్రాజు’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటపాటలతో సందడిగా సాగిందీ వేడుక. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో విజయవంతమైన ‘సోగ్గాడే చిన్నినాయనా’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. జీ స్టూడియోస్‌తో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరకర్త. మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమంలో నాగార్జున, నాగచైతన్య, అమల, కృతిశెట్టి, ఫరియా అబ్దుల్లా, సుమంత్‌, సుశాంత్‌తోపాటు సినీ బృందం పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని