
Bangarraju: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది.. పండగ శోభను తెచ్చేసింది!
ఇంటర్నెట్ డెస్క్: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన పండగలాంటి చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. కృతిశెట్టి, రమ్యకృష్ణ కథానాయికలు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. నాగార్జున అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తండ్రీకొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫిదా చేస్తున్నారు. ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల క్లిప్‌లతో ఈ ట్రైలర్ పండగ శోభను ముందుగానే తీసుకొచ్చిందనిపిస్తుంది.
గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి సీక్వెల్ ఈ ‘బంగార్రాజు’ సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ఇవీ చదవండి
Advertisement