#BB3 రిలీజ్ డేట్ ఫిక్స్..!
నందమూరి అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. అగ్రకథనాయకుడు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
హైదరాబాద్: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే.. గతేడాది బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘BB3 ఫస్ట్ రోర్’ మినహా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ చిత్రబృందం నుంచి రాకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. ఇదిలా ఉండగా.. గత కొన్నిరోజుల నుంచి అగ్రకథానాయకులు తమ సినిమా రిలీజ్ డేట్స్‌తో అలరిస్తున్నారు. ఈ తరుణంలో బాలయ్య-బోయపాటి టీమ్ ఆసక్తికరమైన వార్తను అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
ఇకపోతే.. బాలయ్యను మాస్ పాత్రలో చూపించాలంటే బోయపాటిని మించిన దర్శకులు లేరనేది అభిమానుల అభిప్రాయం. ఈ ఇద్దరూ కలిస్తే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతలా ఉర్రూతలూగించాయో మనందరికీ తెలుసు. ఈ హిట్ కాంబినేషన్‌లో మూడో చిత్రం కూడా వస్తుండటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బీబీ3’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అలరిస్తోంది.
ఇదీ చదవండి
వకీల్‌సాబ్ వచ్చేస్తున్నాడు..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!