Beast: యాక్షన్‌ ‘బీస్ట్‌’

‘‘నేను రాజకీయ నాయకుడ్ని కాదు.. సైనికుడ్ని’’ అంటున్నారు కథానాయకుడు విజయ్‌.  ఇప్పుడాయన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘బీస్ట్‌’. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.

Updated : 03 Apr 2022 07:57 IST

‘‘నేను రాజకీయ నాయకుడ్ని కాదు.. సైనికుడ్ని’’ అంటున్నారు కథానాయకుడు విజయ్‌. ఇప్పుడాయన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘బీస్ట్‌’. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్‌ ఇండియన్‌ స్పైగా వీర రాఘవన్‌ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఓ షాపింగ్‌ మాల్‌లో ఉగ్రవాదులు చొరబడటం.. వాళ్లను మట్టుబట్టేందుకు విజయ్‌ రంగంలోకి దిగడం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో విజయ్‌ చాలా స్టైలిష్‌గా కనిపించారు. సినిమాలో యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాకి అనిరుధ్‌ స్వరాలందించారు. మనోజ్‌ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని