
‘బీస్ట్’ VS ‘కేజీయఫ్2’ ఓటీటీలో ముందుగా వచ్చే చిత్రం ఏది?
ఇంటర్నెట్‌డెస్క్: విజయ్(Vijay) కథానాయకుడిగా ‘బీస్ట్’(Beast), యశ్(Yash) ‘కేజీయఫ్2’(KGF2) చిత్రాలు ఒక రోజు తేడాతో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రెండూ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకున్నాయి. అయితే, ‘బీస్ట్’తో పోలిస్తే, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కేజీయఫ్2’ఆదరణ కాస్త ఎక్కువగా ఉంది. కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలతో పాటు హిందీ ప్రేక్షకులు యశ్ నటన, ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ‘కేజీయఫ్2’ రూ.500కోట్ల కలెక్షన్స్ దాటేసింది. ఈ క్రమంలో ఈ సినిమాల ఓటీటీ విడుదలపై చర్చ మొదలైంది. మరి ఈ సినిమాలు ఎప్పుడు ఓటీటీలో వస్తాయి? సినీ పరిశ్రమ వర్గాలు ఏం చెబుతున్నాయి. ‘కేజీయఫ్2’ కన్నా ‘బీస్ట్’ను ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటి?
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘బీస్ట్’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్/సన్ నెక్ట్స్ దక్కించుకున్నాయి. అన్ని కుదిరితే నాలుగు వారాలు పూర్తవగానే లేదా కాస్త ముందుగానే ‘బీస్ట్’ ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది. మే 11వ తేదీ నుంచి ‘బీస్ట్’ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ‘కేజీయఫ్2’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే, ‘బీస్ట్’అంత వేగంగా రాఖీభాయ్ ఓటీటీలోకి రాడని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఎన్ని కొత్త చిత్రాలు వచ్చినా, ఇంకొన్ని రోజులు పాటు ‘కేజీయఫ్2’ హవా కొనసాగడం ఖాయం. పైగా ఆయా చిత్రాల ఫలితాలపై కూడా రాఖీభాయ్ దూకుడు ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ను బట్టి మే నెలలో ‘కేజీయఫ్2’ను ఓటీటీలో విడుదల చేసే అవకాశం దాదాపు కనిపించటం లేదు. అన్నీ కుదిరితే జూన్, లేదా జులై మొదటి వారంలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. దీనిపైన కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ క్రమంలో ‘బీస్ట్’ను కాస్త ముందుగానే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ‘కేజీయఫ్2’ దూడుకు వల్ల జరిగిన నష్టాన్ని ఓటీటీలో విడుదల చేసి, ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలని ‘బీస్ట్’ టీమ్ భావిస్తోందట. తద్వారా ఓటీటీ వీక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చిత్ర బృందం యోచిస్తోందట. మరి ‘కేజీయఫ్2’ కన్నా ‘బీస్ట్’ ముందే స్ట్రీమింగ్ అవుతుందో లేదో చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: 16 వేల కొత్త కేసులు..24 మరణాలు
-
India News
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 16 మంది దుర్మరణం
-
General News
Chiranjeevi: భీమవరం చేరుకున్న చిరంజీవి.. అభిమానుల ఘనస్వాగతం
-
Business News
Stock Market Update: ఊగిసలాటలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Politics News
Raghurama: నా శ్రేయోభిలాషుల కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నా: రఘురామ
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య