పాన్‌ ఇండియా స్థాయిలో ‘బీస్ట్‌’

దక్షిణ భారతదేశం నుంచి పాన్‌ ఇండియా సినిమాలు హవా పెరుగుతోంది. ఇప్పటికే దర్శక ధీరుడు   రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు అందుకుంటోంది. తాజాగా తమిళ  ప్రేక్షకులు ఆసక్తిగా  

Updated : 27 Mar 2022 07:39 IST

క్షిణ భారతదేశం నుంచి పాన్‌ ఇండియా సినిమాలు హవా పెరుగుతోంది. ఇప్పటికే దర్శక ధీరుడు   రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు అందుకుంటోంది. తాజాగా తమిళ  ప్రేక్షకులు ఆసక్తిగా  ఎదురుచూస్తున్న విజయ్‌ చిత్రం ‘బీస్ట్‌’ను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. తమిళంతో పాటు... హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. దర్శకుడు సెల్వరాఘవన్‌ ఇందులో మరో ముఖ్యపాత్రను   పోషిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు నెల్సన్‌ గతంలో నయనతారతో ‘కోలమావు కోకిల’, శివకార్తికేయన్‌తో ‘డాక్టర్‌’ సినిమాలు తీశాడు. ఈ రెండూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ‘డాక్టర్‌’ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లు అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్‌తో రూపొందించిన ‘బీస్ట్‌’పై అంచనాలు పెరిగిపోయాయి. 2.35 గంటల  నిడివి ఉన్న ఈ సినిమాకు అనిరుధ్‌  రవిచంద్రన్‌ సంగీతం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని