Chiranjeevi: ‘అంజి’ ఇంటర్వెల్‌కు నెలరోజులు.. మూవీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Chiranjeevi: చిరంజీవి కథానాయకుడిగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ మూవీ ‘అంజి’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇవే!
ఇంటర్నెట్‌డెస్క్: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘అంజి’ (Anji). భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అప్పట్లో హాలీవుడ్ సినిమాను తలపించేలా గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు ఐదేళ్లకు పైగా షూటింగ్ జరుపుకొందీ చిత్రం. కాగా, ఇందులో విరామ సన్నివేశాలను నెలరోజుల పాటు తీసినట్లు దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) ఓ సందర్భంలో చెప్పారు. సినిమా అంత భారీగా తీసిన ఘనత నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy)కి దక్కుతుందన్నారు.
‘‘నా జీవితంలో మర్చిపోలేని చిత్రమది. ఆ సినిమాకు పనిచేసిన వారందరినీ ప్రశంసించాలి. ఈ సినిమా క్రెడిట్ మొత్తం నిర్మాతకు దక్కుతుంది. ఎందుకంటే ‘అమ్మోరు’ తర్వాత శ్యాంప్రసాద్‌రెడ్డిగారికి చిరంజీవి డేట్స్ ఇస్తానని అన్నారు. సాధారణంగా చిరంజీవి అంటే కమర్షియల్ సినిమా చేయాలని అనుకుంటాం. కానీ, ఆయనతో గ్రాఫిక్స్‌తో సినిమా చేస్తానని శ్యాంగారు కమిట్ అయ్యారు. ఇదే విషయాన్ని నాకు చెప్పారు. ‘అయ్యో.. చిరంజీవిగారితో గ్రాఫిక్స్ సినిమా ఎందుకండీ.. ఆయనకు సరిపోయే కమర్షియల్ కథ నా దగ్గర ఉంది. పైగా డ్యూయల్ రోల్. అది చేద్దాం’ అని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. దీంతో శ్యాంగారికి తెలియకుండా నేను చిరంజీవిగారిని కలిసి ‘సర్.. గ్రాఫిక్స్ సినిమా అంటే చాలా సమయం పడుతుంది. పైగా గంటల తరబడి నిలబడాలి. కొత్త ఆర్టిస్ట్ చేసినట్లు చేయాలి’ అని చెప్పా. ‘రామకృష్ణా మీరు ఏం కంగారుపడకండి. కొత్త ఆర్టిస్ట్ చేసినట్లు చేస్తా. ఎన్నిరోజులైనా చేస్తా’ అని అన్నారు. చిరంజీవిగారు అదే టెంపోలో సినిమా మొత్తం కనిపించారు’’
‘‘ఇంటర్వెల్ సీన్ నెల రోజులు తీశాం. చిరంజీవి కూడా ఓపిగ్గా చేశారు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు. కథ పరంగా అదొక క్లిష్టమైన సబ్జెక్ట్. అందులో చిరంజీవిగారిని ‘ఒరేయ్’ అనే పాత్ర ఉంది. ఆయన్ను అలా పిలిచే వ్యక్తిగా ఎవరు సరిపోతారా? అని వెతికాం. చివరికి నాగబాబుగారిని వేషం వేసి పెద్దయ్య పాత్ర ఇచ్చాం. సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చాలా పెద్దది. కొన్ని సన్నివేశాలకు 100 నుంచి 120 షాట్స్ తీయాల్సి వచ్చేది. అలా తీయబట్టే దానికి ఐదేళ్లు పట్టింది. శ్యాంగారు చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమాకు పని చేస్తుంటే తల తిరిగిపోయేది. ఎందుకంటే గ్రాఫిక్స్‌వర్క్ సింగపూర్, మలేషియా, అమెరికాల్లో జరిగేది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీసిన షాట్స్ అన్నీ రాత్రికి అమెరికా పంపేవాళ్లం. మరుసటి రోజు ఆ డిస్క్‌లోని షాట్స్ వాళ్లు తీసుకుని మళ్లీ అదే రోజు ఆ డిస్క్‌లను ఇక్కడికి పంపేవాళ్లు’’
‘‘ఇక గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్‌కు మార్కులు పెట్టేవాళ్లం. ఆయన రోజూ అదే డ్రెస్‌వేసుకునే వాళ్లు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. ‘అంజి’ సినిమా ఎప్పుడు టీవీలో చూసినా అద్భుతంగా అనిపిస్తుంది. భారీ అంచనాలతో వెళ్లి చూస్తే, అంతగా ఆకట్టుకున్నట్లు అనిపించకపోవచ్చు. కానీ, చూడగా, చూడగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి క్రెడిట్ ఇవ్వాలంటే అది శ్యాంగారికి. ఆ తర్వాత చిరంజీవిగారికి. చిరంజీవిగారు, హీరోయిన్, విలన్ తప్పితే మిగిలిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ఒకవేళ ఈ ఐదేళ్లలో ఎవరైనా చేయకపోతే అదే పోలికలున్న వ్యక్తిని పెట్టుకోవచ్చని అనుకున్నాం. సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటాడు. అతను ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి వద్ద అడ్డుక్కునే వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి ఆ పాత్ర వేయించాం. అందరం కష్టపడి చేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం’’అని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్‌కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్‌దత్‌ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. -
Mahesh babu: ‘మురారి’ శాపం వెనుక స్టోరీ ఇది.. క్లైమాక్స్‌లో ఆ పాట వద్దన్న కృష్ణ..!
మహేశ్‌బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మురారి’. సోనాలి బింద్రే కథానాయిక. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. -
Jayamalini: జయమాలిని కోసం కత్తితో బెదిరింపు!
సినీ తారలను చూసేందుకు జనం విరగబడి రావడం, వారితో సెల్ఫీల కోసం పోటీ పడటం మనం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అలనాటి నృత్యతార జయమాలినికి (Jayamalini) ఎదురైందట. -
Temper: ఆర్. నారాయణమూర్తి ‘టెంపర్’లో నటించకపోవడానికి కారణమిదే
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్’ తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర అంశం మీకోసం.. -
Oy: ‘ఓయ్’ టైటిల్ అర్థమిదే.. మీరు గమనించారా?
సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన చిత్రం ‘ఓయ్!’. ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారో మీకు తెలుసా? -
Jagapathi Babu: జగపతి బాబుకు ‘విలన్’ అవకాశం తెచ్చి పెట్టిందదే!
నటుడు జగపతి బాబు పుట్టిన రోజు నేడు. సందర్భంగా ఆయనకు విలన్‌గా అవకాశం తెచ్చిపెట్టిందేదో చూద్దామా.. -
Mooga Manasulu: గోదావరిలో పడిపోయిన సావిత్రి.. బయటకు ఎందుకు రాలేదంటే..?
మూగమనసులు (Mooga Manasulu) షూటింగ్ గోదావరి మీద జరుగుతున్న రోజులవి. ‘ఈనాటి ఈ బంధమేనాటిదో...’ పాటను లాంచిపై ఏయన్నార్, సావిత్రిల మీద చిత్రీకరిస్తున్నారు -
Preity Zinta: మేకప్ తీసేసి రమ్మంటే.. మణిరత్నం జోక్ చేస్తున్నారనుకున్నా: ప్రీతీ జింటా ఆసక్తికర వ్యాఖ్యలు
తన తొలి బాలీవుడ్ చిత్రం ‘దిల్ సే’ రోజులను ప్రీతీ జింటా గుర్తు చేసుకున్నారు. -
Mukesh Rishi: ‘లగాన్’లో ఛాన్స్ వదులుకుని.. సౌత్‌లో టాప్ విలన్ అయ్యారు!
Mukesh Rishi: ప్రతి నాయకుడిగా తెలుగు, తమిళ చిత్రాల్లో మెప్పించిన నటుడు ముఖేష్ రిషి. ఆమిర్ ఖాన్ నటించిన ‘లగాన్’లో కీలక పాత్రను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఇటీవల ఆయన పంచుకున్నారు. -
SV Krishna Reddy: రాజేంద్రప్రసాద్ చేయనన్న సాంగ్... అలా బాబూమోహన్‌తో చేశారు!
Mayalodu: ‘మాయలోడు’ సినిమా సందర్భంగా జరిగిన ఆసక్తికర సంఘటనను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పంచుకున్నారు. -
పార్వతి పాత్రను కోల్పోయిన షావుకారు జానకి
చిత్ర పరిశ్రమలో ఎవరి అదృష్టం ఎలా, ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్క సినిమా చాలు నటుల జీవితాలు మారిపోవడానికి. ‘షావుకారు’ చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మెప్పించారు జానకి.
తాజా వార్తలు (Latest News)
-
Narayana Murthy: మనవడికి నారాయణమూర్తి ఖరీదైన గిఫ్ట్
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Hyderabad News: చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్‌లో వర్షం!
-
Tamilisai: రాజీనామాపై స్పందించిన తమిళిసై సౌందరరాజన్
-
Sanjay Singh: ‘ప్రమాణ స్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి’ - దిల్లీ కోర్టు
-
TS News: హోమ్ ఓటింగ్‌కు ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్‌రాజ్